/rtv/media/media_files/2025/08/07/cloud-burst-warning-for-hyderabad-2025-08-07-20-25-45.jpg)
Cloud burst warning for Hyderabad.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్లకు పైగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజల బయటకు రావొద్దని హైడ్రా(Hydra) హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, మణికొండ, హైటెక్ సిటీలో జోరు వర్షం కురుస్తోంది. మాదాపూర్ పూర్తిగా నీటమునిగింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు ఆఫీసుల్లోనే చిక్కుకుపోయారు. కొంతమంది ధైర్యం చేసి రోడ్లపైకి వచ్చినప్పటికీ భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
Cloud Burst For Hyderabad
FLASH FLOOD WARNING FOR HYDERABAD ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) August 7, 2025
Since Hyderabad is having a CLOUBURST, lakes can suddenly get flooded. It's going to be extremely serious situation for Hyderabad next few hours. Prayers for everyone 🙏⚠️🙏🙏🙏🙏🙏🙏
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో రాత్రి పదిగంటల వరకు భారీవర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. రెండు మూడు గంటలుగా కురుస్తోన్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోవడంతో.. వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒక్కసారిగా నీరు కుమ్మరించింది. కాగా.. హైదరాబాద్ కు క్లౌడ్ బరస్ట్ (Cloud Burst for Hyderabad) హెచ్చరిక చేశారు తెలంగాణ వెదర్ మ్యాన్. నగరంలోని పలు ప్రాంతాల్లో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు.
మరోవైపు ఒకవేళ క్లౌడ్ బరస్ట్ జరిగితే నాలాలు, చెరువులు పొంగి వరదలు సంభవించే అవకాశం ఉందని, ఆ సమయంలో అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే కొద్ది గంటలపాటు నగర ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలిపారు.
Also Read : తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ముంచేత్తిన వాన..
హైదరాబాద్ సిటీలో పెనుగాలులతో కుండపోతగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, మాదపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిల్ మాల్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో వర్షం దంచికొడుతోంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమైంది.
Also Read: మూడు రోజులు కుమ్ముడే కుమ్ముడు.. అసలు బయటకు వెళ్లొద్దు
rain alert for hyderabad | imd issue rain alert | telangana cloud burst