Rain Alert: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం.. ఆ ప్రాంతాల వారికి హెచ్చరిక

హైదరాబాద్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో రెండు మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

New Update
HYD Rain

HYD Rain

హైదరాబాద్‌ను వర్షాలు(Hyderabad Rains) వీడటం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుంది. కానీ, సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. క్యూమిలో నింబస్ మేఘాలు కమ్ముకోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో  రెండు మూడు గంటల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణంలో వచ్చిన మార్పులతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ, గుడిమల్కాపూర్, సికింద్రాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. అమీర్ పేట్, జూబ్లీహిల్స్, సుల్తాన్ బజార్, కుత్బుల్లాపూర్, దుండిగల్, బంజారాహిల్స్, బేగం బజార్,  గండి మైసమ్మ, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, మల్లంపేట, బహదూర్ పల్లి, గాజులరామారం తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అమీర్ పేట్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. బోయిన్‌పల్లి, అల్వాల్, బొల్లారం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, డీఆర్‌ఎఫ్‌ బృందాలను వాతావరణ శాఖ అలెర్ట్‌ చేసింది.

Also Read :  మూడు రోజులు కుమ్ముడే కుమ్ముడు.. అసలు బయటకు వెళ్లొద్దు


ఇదిలా ఉండగా కోఠి, మొహింజాహి మార్కెట్, నాంపల్లి తదితర  ప్రాంతాల్లో చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. అయా ప్రాంతాల్లో వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని అవసరం అయితే తప్ప భయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, మైలర్ దేవ్ పల్లి, అత్తాపూర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, బండ్లగూడ జాగిర్, కిస్మత్ పూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read :  హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!

మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

వాతావరణంలో వచ్చిన మార్పులతో రానున్న నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం, తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్షం పొంచి ఉందని పేర్కొంది.  నల్గొండ,  యాదాద్రి భువనగిరి, పాలమూరు, నాగర్ కర్నూల్, వనపర్తి  నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో తదితర జిల్లాలలో ఈరోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

rain alert for hyderabad | imd issue rain alert | HYD Rain Alertheavy rain alert to telangana | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు