/rtv/media/media_files/2025/08/19/ts-alert-2025-08-19-17-21-59.jpg)
TS ALERT : Extremely heavy rain forecast for Telangana
TS ALERT : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ర్ట వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డేంజర్‌లో ఉందని ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అత్యంత భారీ వర్ష సూచన చేసింది.ఇప్పటికే జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా యి. గతరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని రహదారులు జలమయమయ్యాయి.కాగా, ఈ నెల 23 వరకు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సైతం భారీ వర్ష సూచన చేసింది.
ఇది కూడా చూడండి:Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!
కాగా, గత పదిరోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయ న్నారు. ఈ అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నం నాటికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు రెయిన్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
నేడు, రేపు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, , జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నిజామాబాద్ వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, సూర్యాపేట, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read : Rahul Sipligunj Engagement Photos: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు చూశారా.. జోడీ ఎంత బాగుందో?