/rtv/media/media_files/2025/08/28/heavy-rains-2025-08-28-07-15-17.jpeg)
Telangana Heavy rains
Telangana Heavy rains : తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేనివిధంగా వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి రోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత కూడా కామారెడ్డి, మెదక్, కరీంనగర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా ఈరోజు వినాయక నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో వాతవారణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు మరోసారి వర్ష సూచన జారీ చేసింది. తెలంగాణ లోని ఆదిలాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే హైదరాబాద్ నగర వాసులకు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో నేడు వర్షానికి ఛాన్స్ లేదని స్పష్టం చేసింది. దీంతో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంది. రాత్రిపూట చిరుజల్లులు పడే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో ఇటీవల వర్షాలు విస్తారంగా కురిశాయి. కొన్ని జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా్ల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ అయింది. నేడు ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.
ఇక హైదరాబాద్ నగరంలో నేడు గణేశ్ నిమజ్జనం కార్యక్రమం జరగనుంది.. అయితే నగర వాతావరణం నిమజ్జనానికి అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేసింది. నిమజ్జన సమయంలో వర్షాలు కురిసే అవకాశం లేదు. రాత్రి వేళలో స్వల్పంగా, అడపాదడపా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి గణేశ్ నిమజ్జనం కార్యక్రమానికి పెద్దగా ఆటంకం కలిగే అవకాశం లేదు. భక్తులు నిమజ్జనాన్ని ఎలాంటి ఆందోళన లేకుండా పూర్తి చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు నిమజ్జనాన్ని సజావుగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనానికి వెళ్లే భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
గత పది రోజుల క్రితం కురిసిన వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పొలాలు, రోడ్లు నీటిలో మునిగిపోయాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో రవాణా వ్యవస్థ కూడా ప్రభావితమైంది. అనేక చోట్ల రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆహారం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించారు. తాజాగా మరోసారి వర్షం హెచ్చరికలు జారీ కావటంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇది కూడా చూడండి:History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ ప్రత్యేకతలివే...