Guillain Barre Syndrome: పూణేని వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. 59 కేసులు
మహారాష్ట్రలోని పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 59 మంది గులియన్ బారే సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. వారిలో 12 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. నగరంలో అకస్మాత్తుగా పెరుగడంతో ఆరోగ్య శాఖ పరిశీలించడానికి ఓ టీంను ఏర్పాటు చేసింది.