/rtv/media/media_files/2025/01/23/efcAIFLfma5qHE6Ri2VJ.jpg)
Guillain Barre syndrome Photograph: (Guillain Barre syndrome)
Guillain Barre Syndrome: మహారాష్ట్రలోని పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 59 మంది గులియన్ బారే సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. 59 మందికి గులియన్-బారే సిండ్రోమ్ (GBS) న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. వారిలో 12 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. నగరంలో అకస్మాత్తుగా పెరుగుతున్న గులియన్ బారే సిండ్రోమ్ కేసులను పరిశీలించడానికి మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ టీంను ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి : రాత్రి తరచుగా మూత్రం వస్తుందా.. ఈ తప్పులు చేయకండి
గులియన్ బారి సిండ్రోమ్ పక్షవాతానికి దారితీస్తుంది..
జనవరి 22 నాటికి 59 GBS కేసుల్లో 38 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. 12 మంది పేషెంట్లకు తీవ్రత పెరిగి వెంటిలేటర్‌పై ఉన్నారు. బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు GBSకి దారితీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఇది చిన్న పిల్లలు, యువకుల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ సిండ్రోమ్‌ను ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే.. పూర్తిగా కోలుకుంటారు. గులియన్-బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. బాడీలో ఇమ్యూనిటీ నరాలపై దాడి చేస్తుంది. గులియన్ బారి సిండ్రోమ్ బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతానికి దారితీస్తుంది. ఇది సోకడానికి కచ్చతమైన కారణాలు లేవు.
ఇది కూడా చదవండి : ఈ ఆకుతో మొటిమలకు ఇట్టే చెక్ పెట్టేయవచ్చు
బలహీనత, ఫస్ట్ పాదాలు, తర్వాత శరీరాన్ని కాళ్లు, చేతులు, ముఖం, శ్వాస కండరాలు వీక్ అవుతాయి. మెట్లు ఎక్కడం, నడవడం కష్టంగా అనిపిస్తుంది. ఈ సిండ్రోమ్‌లో లక్షణాలు. GBSలో నరాల దెబ్బతినడంతో మెండ్ అసాధారణమైన సంకేతాలను అందుతాయని US నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ తెలిపింది. దృష్టిలో ఇబ్బంది, మ్రింగడం, మాట్లాడటం లేదా నమలడం, చేతులు, కాళ్ళలో నొప్పి, రాత్రిపూట నొప్పి తీవ్రంగా మొదలైనవి సిండ్రోమ్ ఇతర లక్షణాలు. అసాధారణ హాట్‌బీట్, రక్తపోటు, జీర్ణక్రియ, మూత్రాశయ నియంత్రణలో సమస్యలు ఉంటాయి.
ఇది కూడా చదవండి : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!