/rtv/media/media_files/2025/01/27/aHSWJLOUULJv9ddQosdc.jpg)
Guillain-Barre syndrome
Guillain-Barre syndrome: దేశంలో మొన్నటి వరకు హెచ్‌ఎంటీవీ వైరస్ ప్రజలను భయపెట్టింది. ఇప్పుడు మహారాష్ట్రాలోని పూణేలో గులియన్-బారే సిండ్రోమ్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన సంఖ్య పూణేలో పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 100కు దాటింది. ఈ వ్యాధి పడిన ఒకరు షోలాపూర్ జిల్లాలో మరణించారు. దీంతో ప్రజలు భయాందళోనకు గురవుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో 68 మందికి పైగా పురుషులు ఉండగా.. 33 మంది మహిళలు ఉన్నారు.
Guillain-Barre Syndrome (GBS) cases | 101 patients have been found until now. 81 patients are from Pune MC, 14 from Pimpri Chinchwad MC and 6 are from other districts: Public Health Department, Maharashtra pic.twitter.com/kdoip599yT
— ANI (@ANI) January 27, 2025
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
గులియన్-బారే సిండ్రోమ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో వెంటనే హెల్త్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి బారిన పడి అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ కూడా 1945లో మరణించారు. ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్‌కి ఈ సిండ్రోమ్ ఎక్కువ కావడంతో పక్షవాతానికి గురై మరణించారు. మొదట అందరూ పోలియో అనుకున్నారు.. కానీ తర్వాత రిపోర్ట్‌లో గులియన్-బారే సిండ్రోమ్ ఉన్నట్లు తేలింది. ఇది ఒక అరుదైన వ్యాధి. ఈ వైరస్ సోకితే రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఇది నాడీ వ్యవస్థపై దాడి చేయడంతో కండరాలు అన్ని బలహీనమై ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
ఈ సిండ్రోమ్ లక్షణాలు
గులియన్-బారే సిండ్రోమ్ కాంపిలోబాక్టర్ బెజుని అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఫుడ్, వాటర్ వల్ల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం, కండరాలు బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని నివారించడానికి పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే శుభ్రంగా ఉండటంతో పాటు స్వచ్ఛమైన నీరు తాగడం, పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే