Maharashtra: ‘జీబీఎస్’ డేంజర్ బెల్స్: ఇప్పటికే ఐదుగురు మృతి.. 163కు చేరిన బాధితులు

గులియన్ బారే సిండ్రోమ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు మెళ్ల మెళ్లగా సోకుతూ .. పలువురి ప్రాణాలు కూడా తీస్తోంది. జనవరి చివరి వారంలో అక్కడ జీబీఎస్ తొలి మరణం నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుకి చేరింది.

New Update
gbs

gbs

 కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని విడిచి ఇప్పుడిప్పుడే బయటకు పోయింది అని ఇప్పుడిప్పుడే అందరు ఊపిరి తీసుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ ప్రజలను కలవర పెట్టడానికి రెడీ అయ్యింది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌‌లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు పాకుతుంది. ఉహించిన దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. క్రమంగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 

Also Read: Musk-Aakash: మస్క్‌ డోజ్ లో భారత సంతతి కుర్రాడు ఆకాశ్‌ బొబ్బ..ఎవరో తెలుసా!

అక్కడ ప్రస్తుతం 163 మందికి ఈ వైరస్ నిర్దారణ అవ్వగా.. ఒక్క పుణే జిల్లాలోనే 149 కేసులు నమోదయ్యాయి. తాజాగా, నాందేడ్‌లో జీబీఎస్ బారినపడి చికిత్స పొందుతూ 60ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. దీంతో మొత్తం జీబీఎస్ మరణాలు సంఖ్య 5కు చేరుకున్నాయి.ఈ క్రమంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. ‘సోమవారం కొత్తగా ఐదుగురికి జీబీఎస్ నిర్దారణ అయ్యింది.

Also Read: Jaya Bachchcan: తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారంటూ జయబచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు!

ఎటువంటి మరణం లేదు.. ఇప్పటి వరకూ 127 కేసులు నిర్దారణ అయ్యాయి. అనుమానిత 163 కేసుల్లో పుణే నగరంలో 32, ఇటీవల పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగా చేరిన గ్రామాల్లో 86, పింప్రి చించివాడలో 18, పుణే గ్రామీణ జిల్లాలో 19, ఇతర జిల్లాల్లో 8 మంది ఉన్నారు’ అని పేర్కొన్నారు

జీబీఎస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకూ 47 మంది కోలుకున్నారని చెప్పారు. మరో 47 మంది ఐసీయూలోనూ.. 21 మంది వెంటలేటర్‌పైన చికిత్స పొందుతున్నట్టు వివరించారు.అలాగే, పుణే నగరంలోని వివిధ ప్రాంతాల్లో 168 నమూనాలను సేకరించి.. పరీక్షల కోసం పుణే నేషనల్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. ఎనిమిది నీటి వనరులు కలుషితమైనట్టు గుర్తించామని అన్నారు. అసోంలో తొలి జీబీఎస్ మరణం నమోదుకాగా.. గతవారం తెలంగాణాలోనూ ఈ వైరస్ మొదటి కేసు నిర్దారణ అయ్యింది. సిద్దిపేటకు చెందిన మహిళకు పాజిటివ్‌గా వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నారు.

Also Read: MMTS Trains: రూ.20 టికెట్‌తో గంటలో హైదరాబాద్‌ నుంచి యాదగిరి గుట్టకు...ఎంఎంటీఎస్‌ రైలు!

Also Read:  America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

Advertisment
తాజా కథనాలు