Waynad: చాలా గర్వంగా ఉంది–రాహుల్ గాంధీ
వాయనాడ్ లో ప్రియాంక గాంధీ సంచలన విజయం సాధించారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లో ప్రియాంక గెలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు.
వాయనాడ్ లో ప్రియాంక గాంధీ సంచలన విజయం సాధించారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లో ప్రియాంక గెలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు.
ప్రియాంక గాంధీ తన గెలుపుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు.
తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సత్తా చాటుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు పోటీ చేసిన ప్రియాంక అన్న రాహుల్ గాంధీని బీట్ చేశారు. ప్రస్తుతం ఆమె 3,09,690 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు.
వయనాడ్‌లో ప్రియాక గాంధీ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో అక్కడ రాహుల్ గాంధీ 3 లక్షల అధిక్యంతో గెలిచారు. ఆయన రాజీనామాతో ఇక్కడ వచ్చిన ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు.
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజున వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీతో పాటూ ప్రచార సభలో పాల్గొన్నారు. ఇందులో వాయనాడ్ ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు.
వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 13న ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్‌ను నిలబెట్టారని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.