/rtv/media/media_files/2024/11/28/H46BwKjdPjawIc3c6QMU.jpg)
వయానాడ్ నుంచి గెలిచిన ప్రియాంక గాంధీ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన సమీప అభ్యర్థిపై ఏకంగా 4.04 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవగా.. ఆయన రికార్డును ప్రియాంక గాంధీ బ్రేక్ చేశారు. వయనాడ్ నుంచి మొదటిసారిగా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన ప్రియాంక గాంధీ ఇలా భారీ మెజార్టీతో గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
#WATCH | Congress leader Priyanka Gandhi Vadra takes oath as Member of Parliament in Lok Sabha
— ANI (@ANI) November 28, 2024
(Video source: Sansad TV/YouTube) pic.twitter.com/eaLJzpTY2y
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన గెలుపుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు. తన ప్రచారం కోసం పనిచేసిన యూడీఎఫ్‌లోని సహచరులు, కేరళలోని కాంగ్రెన్ నేతలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్డ్ వద్రా ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిదంటూ కొనియాడారు.
Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నికల అనివార్యమైంది. ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ మొదటిసారిగా ఎంపీగా పోటీ విజయం సాధించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న సోనియా గాంధీ ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇప్పుడు సోనియా గాంధీతో పాటు.. కొడుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంటులో కనిపించనున్నారు.