Priyanka Gandhi: వయనాడ్‌లో గెలుపుపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

ప్రియాంక గాంధీ తన గెలుపుపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు. 

New Update
JJJJ

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్‌లో భారీ విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై ఏకంగా 4.04 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవగా..  ఆయన రికార్డును ప్రియాంక గాంధీ బ్రేక్ చేశారు. వయనాడ్‌ నుంచి మొదటిసారిగా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన ప్రియాంక గాంధీ ఇలా భారీ మెజార్టీతో గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమెకు 6.20 లక్షల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చాయి. ఇక సీపీఐ అభ్యర్థి సత్యన్ మోకెరీ 2 లక్షల ఓట్లకు పైగా వచ్చాయి. 

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన గెలుపుపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు. తన ప్రచారం కోసం పనిచేసిన యూడీఎఫ్‌లోని సహచరులు, కేరళలోని కాంగ్రెన్ నేతలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్డ్ వద్రా ఇచ్చిన సపోర్ట్‌ మర్చిపోలేనిదంటూ కొనియాడారు.  

Also Read: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

Also Read: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం!

Also Read: Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు