ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు ..

ప్రజల హక్కులు నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం తన స్నేహితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వయనాడ్ ప్రజల కోసం తన గొంతుని వినిపిస్తానన్నారు.

author-image
By B Aravind
New Update
VV

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వయనాడ్‌లోని మనంతవాడిలో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రజల హక్కులు నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్న శక్తులపై తాము పోరాటం చేస్తున్నానని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రజల గురించి ఆలోచించకుండా తన స్నేహితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల వయనాడ్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్రంగా నష్టపోగా.. కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని తెలిపారు.  

Also Read: సంచలనం రేపుతున్న తృతీయ జ్యువెలరీ మోసం.. కాంతిదత్‌ అరెస్టు

ఇప్పుడు వయనాడ్ ఎంపీగా తాను అక్కడి ప్రజల అవసరాలు, హక్కుల కోసం పార్లమెంటులో పోరాడుతానని వ్యాఖ్యానించారు. మనదేశంలో ఉన్న వ్యవస్థలను బలహీనం చేసేందుకు యత్నిస్తున్న వాళ్లకి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ఏజెన్సీలైన సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని విమర్శించారు. విపక్షాలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: ఇండియా కూటమికి షాక్.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న కేజ్రీవాల్

ఇదిలాఉండగా.. రెండ్రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రియాంక, రాహుల్‌ గాంధీతో కలిసి శనివారం వయనాడ్‌కు వచ్చారు. తిరువంబాడిలోని ముక్కం, వండూరు, కొయ్‌కోడ్‌, నికంబూర్‌లోని కౌలై, మలప్పురం జిల్లాల్లో బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రాంత ప్రజలను కలిసి.. వారి బాగోగులు తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన వయనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే.  

Also Read: కోర్టు సంచలన తీర్పు.. 141 ఏళ్లు జైలు శిక్ష.. ఎందుకంటే?

Also Read: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు