Waynad: చాలా గర్వంగా ఉంది–రాహుల్ గాంధీ

వాయనాడ్ లో ప్రియాంక గాంధీ సంచలన విజయం సాధించారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లో ప్రియాంక గెలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. 

New Update
waynad

 గాంధీ కుటుంబం నుంచి వచ్చినా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం ప్రియాంకా గాంధీకి దే మొదటిసారి. ఇప్పటివరకు పార్టీ తరుఫుఓ, అన్న లే అమ్మ తరుఫునీ ప్రచారం చేయడం, పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం లాంటివి చేసిన ప్రియాంకా గాంధీ మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. తన అన్న వదిలేయాల్సి వచ్చిన స్థానం అయిన వానాలో పోటీ చేశారు. ఇందులో ఆమె అఖండ విజయం సాధించారు. తన సమీప అభ్యర్థిపై ఏకంగా 4.04 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవగా..  ఆయన రికార్డును ప్రియాంక గాంధీ బ్రేక్ చేశారు.

Also Read: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

గర్వంగా ఉంది...

దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. చెల్లెల విజయంపై ఆయన ట్వీట్ చేశారు. వాయనాడ్‌లో ప్రియాంక తమ కుటుంబ లెగసీని కంటిన్యూ చేశారని...అందుకు గర్వంగా ఉందని అన్నారు.  ఇదే ఊపుతో ఆమె వాయనాడ్‌లో పని చేస్తారని నమ్ముతున్నానని చెప్పారు. వాయనాడ్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రియాంక పేషన్‌తో, ధైర్యంగా పని చేస్తారని విశ్వసిస్తున్నాని రాహుల్ అన్నారు. వాయాడ్‌ ప్రజలకు గాంధీ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పారు. ప్రియాంక మీద వారు చూపించిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Also Read: హమ్మయ్య ధారావి ప్రాజెక్టు సేఫ్...ఆదానీకి కాస్త ఊరట

Also Read: MH: మనిషే కామ్..పని మాత్రం స్ట్రాంగ్...మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం శిండే?

 ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు