వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజున వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీతో పాటూ ప్రచార సభలో పాల్గొన్నారు. ఇందులో వాయనాడ్ ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు. 

New Update
11

Waynad Elections: 

వాయనాడ్ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్ధి ప్రాయాంఆఆంధీఓ పాటూ తన అన్న రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జరిగిన బారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా వయనాడ్‌కు నా హృదయంలో గొప్ప స్థానం ఉందని ఆయన చెప్పారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రాంత అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలి. ఉత్తమ పర్యాటక ప్రదేశంగా మార్చడానికి ప్రియాంక కృషి చేయాలి. ఎవరైనా కేరళ వస్తే మొదట ఈ ప్రాంతమే గుర్తుకు రావాలి. కాబోయే ఎంపీ దీనిని ఛాలెంజ్‌గా తీసుకోవాలి అంటూ తన చెల్లెలు ప్రియాంకకు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. వాయనాడ్‌కు మంచి జరిగితే.. అది తనకు ఆనందాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

Also Read: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

వాయనాడ్ ప్రజలుకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జులైలో వాయనాడ్‌లో కొండచరియలు విరిగి పడి వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆంతో పాటూ చాలా ప్రాంతాలు బురదలో కొట్టుకుపోయాయి. ప్రియాంక గెలిచాక ఆ ప్రాంతాలన్నింటినీ బాగు చేయాలని...వాయనాడ్‌ను బెస్ట్ పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పారు. అది వాయనాడ్ ప్రజలకు, వారి ఆర్ధిక వ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తుందని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Also Read: నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్

Also Read: వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ

Also Read: ముగిసిన విస్తారా కథ..ఈరోజు నుంచి ఎయిర్ ఇండియాలో విలీనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు