Pope Fransis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగేది అప్పుడే.. హాజరుకానున్న ట్రంప్
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ వెల్లడించింది. అలాగే ఆయన భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు.