Pope Fransis: పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు జరిగేది అప్పుడే.. హాజరుకానున్న ట్రంప్

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ వెల్లడించింది. అలాగే ఆయన భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్‌ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు.

New Update
Pope Fransis

Pope Fransis

కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) సోమవారం కన్నుముసిన సంగతి తెలసిందే. అయితే ఆయన అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ వెల్లడించింది. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై మంగళవారం కీలక కార్డినళ్ల మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పోప్‌ ఫ్రాన్సిస్ భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్‌ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 9 రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తున్నారు. 

Also Read: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

వాస్తవానికి పోప్ అంత్యక్రియలు.. మృతి చెందిన సమయం నుంచి 4 నుంచి 6 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం చేయాలని నిర్ణయించారు. మరోవైపు పోప్ భౌతికకాయ ఫొటోలను కూడా వాటికన్ తొలిసారిగా విడుదల చేసింది. పోప్‌ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా హాజరుకానున్నారు. యూఎస్ ప్రథమ మహిళ, ఆయన సతీమణి మెలానియా కూడా అక్కడికి వెళ్లనున్నారు.  

Also Read: పార్లమెంట్‌ కంటే అత్యుత్తమమైనది మరొకటి లేదు: ఉప రాష్ట్రపతి

పోప్‌ ఫ్రాన్సిస్ మరణంపై ప్రపంచ దేశాలు స్పందిస్తుండగా.. చైనా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వాటికన్‌ సిటీ, చైనా మధ్య గత కొన్నేళ్లుగా సరైన సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. చైనాలో బిషప్‌లను ఎవరు నియమించాలనే అంశంపై 1951లో వివాదం రావడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దూరమయ్యాయి. ఇదిలాఉండగా.. పోప్ ఫ్రాన్సిస్ తర్వాత ఆ స్థానంలోకి వచ్చే కొత్త వాళ్లని ఎన్నుకునేందుకు భారత్ కూడా కీలక పాత్ర పోషించనుంది.

Also Read: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

 మొత్తం 135 మంది కార్డినళ్లు కలిసి కొత్త పోప్‌ను ఎన్నుకోనున్నారు. వీళ్లలో భారతీయులు కూడా ఉన్నారు. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినళ్లు పోప్‌.. అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఆ తర్వాత సిస్టీన్ ఛాపెల్‌లో పాపల్ కాంక్లేవ్‌ నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో భారత్ నుంచి కార్డినళ్లు  ఫిలిప్‌ నెరి ఫెర్రావ్‌, క్లీమిస్‌ బసెలియోస్‌, ఆంథోనీ పూల, జార్జ్‌ జాకబ్‌ కూవకాడ్‌ సైతం పాల్గొననున్నారు. 

 Pope Francis | telugu-news | rtv-news | donald-trump

Advertisment
తాజా కథనాలు