Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు ఇదే.. నైట్‌పబ్ బౌన్సర్ నుంచి పోప్‌గా!!

పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. కాథలిక్ క్రిస్టియన్స్ మతగురువు సోమవారం వాటికన్ సిటీ చర్చిలో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన 1938లో అర్జెంటీనాలో జన్మించాడు. టైమ్స్ మ్యాగజైన్ 2013లో ఆయన పేరును పర్సన్ ఆఫ్ ది ఈయర్‌గా ప్రకటించింది.

New Update

సామాన్యుడిగా కనిపించే ఆయన 1.4 బిలియన్ల మంది కాథలిన్లకు ఆరాధ్య దైవం. 1938లో ఫ్రాన్సిస్‌ అర్జెంటీనాలో జన్మించి.. దక్షిణ అమెరికా నుంచి పోప్‌ పదవిని తీసుకున్న తొలివ్యక్తి ఆయనే. ఆయన్ని ప్రజల పోప్ అని కూడా పిలుస్తారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. ఆయన అట్టడుగుస్థాయి నుంచి తన జీవితాన్ని  ప్రారంభించి ఎన్నో స్థానాలను అధిరోహించారు. పోప్ ఫ్రాన్సిస్‌ గురించ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

Also read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇలానే.. తర్వాత పోప్ ఎవరు?

పోప్ ఫ్రాన్సిస్ తండ్రి మారియో జోస్ బెర్గోగ్లియో ఇటలీ నుండి వచ్చిన అకౌంటెంట్, ఆయన తల్లి రెజీనా ఇటాలియన్ వలసదారుల కుమార్తె0 ఆయనకు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఆయన ఆధ్యాతికం వైపు రాకముందు యువకుడిగా ఉన్నప్పుడు ఓ నైట్‌క్లబ్ బౌన్సర్‌గా పని చేశాడు. తర్వాత కెమికల్ టెక్నిషియన్‌గా కూడా పని చేశాడు. కెమిస్ట్రీలో ఆయన డిప్లామా చేశాడు.

టైమ్స్, ఫోర్బ్స్ మ్యాగజైన్స్ లో..

పోప్ ఫ్రాన్సిస్ చిన్నతనంలో న్యుమోనియా కారణంగా కుడి ఊపిరితిత్తులలో ఒక భాగాన్ని కోల్పోయాడు. ఆయనకు ఇప్పటివరకూ ఒకటే లంగ్ మీద బతికాడాడు. 2013లో టైమ్స్ మ్యాగజైన్ పోప్ ఫ్రాన్సిస్‌ను పర్సన్ ఆఫ్ ది ఈయర్ అని ప్రకటించింది. 2018లో ఫోర్బ్స్ మ్యాగజైన్  విడదల చేసిన జాబితాలో ప్రపంచంలోనే టాప్ 10 వ్యక్తుల్లో పోప్ ఆరో స్థానంలో నిలిచారు.

Also read: TS High Court: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్

పోప్ ఫ్రాన్సిస్ నిరాడంబరమైన వ్యక్తి. అంత అత్యున్నత పదవిలో ఉండి కూడా ఆయన సాధారణమైన వ్యక్తిలా జీవితాన్ని గడుపుతాడు. ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తాడు. అంతేకాదు ప్రజలతోపాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించుకుంటాడు. అతను అందరిని నవ్విస్తూ ఉంటుంటాడు. అతను కార్డినల్‌గా ఉన్నప్పటికీ ఆయన భోజనాన్ని ఆయనే వండుకునే వాడు. తరచుగా బియ్యం, పాస్తా, సూప్ వంటి సాధారణ వంటకాలను తినేవాడు. టాంగో అనే సంప్రదాయ నృత్యం అంటే ఆయనకు చాలా ఇష్టం. పోప్‌ కావడానికి ముందు ఆయన స్నేహితురాలితో నృత్యం చేసేవాడు. పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనా సాకర్ క్లబ్ శాన్ లోరెంజో డి అల్మాగ్రోకు పెద్ద ఫ్యాన్. పోప్ ఫ్రాన్సిస్ స్పానిష్, ఇటాలియన్, జర్మన్ భాషలలో నిష్ణాతులు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలను కొంతవరకు మాట్లాడగలడు.

(pope | Pope Francis | intresting-facts | nightclubs | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు