Pope Fransis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న పోప్‌ సోమవారం ఉదయం 7.35 గంటలకు పోప్‌ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఈస్టర్ వేడుక జరగగా మరుసటి రోజే ఆయన తుదిశ్వాస విడిచారు. 

New Update
Pop Fransis

Pop Fransis

కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న పోప్‌ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది.  సోమవారం ఉదయం 7.35 గంటలకు పోప్‌ తన నివాసంలో మరణించారని తెలిపింది. ఆదివారం జరిగిన ఈస్టర్‌ వేడుకల్లో కూడా పోప్‌ అనారోగ్యం కారణంగా పాల్గొనలేదు. అయితే ఈస్టర్‌ మరుసటి రోజే ఆయన తుదిశ్వాస విడిచారు. పోప్ తన జీవితాన్ని చర్చి సేవకే అంకితం చేశారని వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ తెలిపారు. 

Also Read :  ఇంకో పదేళ్లయినా తగ్గేదేలే..! హెబ్బా కామెంట్స్ వైరల్

Pope Francis Dies At 88

గత కొంతకాలంగా పోప్‌ శ్వాసకోస సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత మార్చిలో డిశ్చార్జి అయ్యారు. 2013లో 16వ పోప్‌ బెనిడెక్ట్‌ తర్వాత పోప్‌ ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలు చేపట్టారు.   

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

1938లో ఫ్రాన్సిస్‌ అర్జెంటీనాలో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి పోప్‌ పదవిని తీసుకున్న తొలివ్యక్తి ఆయనే. ఆయన్ని ప్రజల పోప్ అని కూడా పిలుస్తారు. సామాజిక అంశాలపై కూడా ఫ్రాన్సిస్‌ తరచుగా వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఆయన ఇతర మతానికి చెందిన శరణార్థులు పాదాలు కూడా కడిగారు. దీన్ని ఆయన వినయం, సేవకు చిహ్నంగా భావిస్తారు.   

Also Read: న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనం.. వార్ సీక్రెట్స్ ను ఇంట్లో చెప్పిన రక్షణ మంత్రి!

ఇదిలాఉండగా పోప్‌ ఫ్రాన్సిస్ తన మరణానికి కొన్ని గంటల ముందు ఈస్టర్ సందర్భంగా భక్తులకు సందేశం ఇచ్చారు. వాటికన్ సిటీలోని పీటర్స్ స్క్వేర్‌లో దాదాపు 35 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఈస్టర్‌ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్‌లో శాంతి నెలకొనాలని కోరారు. 

Also Read :  అల్లు అర్జున్‌పై మరో కేసు నమోదు?

 

telugu-news | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు