/rtv/media/media_files/2025/04/22/WCYoEALNWjHhz2RPaKp6.jpg)
2013 నుంచి పోప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. దీంతో ఆయన స్థానంలో కొత్త పోప్ ను ఎన్నుకోవారి ఈ ప్రక్రియ 15 నుంచి 20 రోజుల్లోగా జరగాలి. పోప్ అంత్యక్రియలు జరిగిన రెండు లేదా మూడు వారాల్లో ఈ ప్రక్రియ జరగాలి. 1.3 బిలియన్ మంది కాథలిక్ క్రిస్టియన్ల మతపెద్ద బిషప్‌గా పోప్ వ్యవహరిస్తాడు. కాథలిక్ కమ్యునిటీకి ఇతనే అధిపతి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ క్రిస్టియన్ల విశ్వాసం, నైతికత అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాడు.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
నూతన పోపాల్‌ను ఎన్నుకునే ప్రక్రియలో భారత దేశానికి చెందిన నలుగురు కార్డినల్స్ కూడా పాల్గొననున్నారు. కార్డినల్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద చర్చి ఆస్తులు నిర్వహించే వారు. మొత్తం 135 మంది కార్డినల్స్ పోప్ ఎన్నికలో పాల్గొంటారు. వారంతా 80ఏళ్ల లోపు వారై ఉండాలి. పోప్ ఎన్నిక సిస్టీన్ చాపెల్ లో అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఇందులో నలుగురు భారతీయ కార్డినల్స్ వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో ఇద్దరు కేరళ నుంచి ఉన్నారు.
Four Indian cardinals to cast their votes for the next pope
— WION (@WIONews) April 22, 2025
Here's everything to know about them: https://t.co/8pm4IKWePbhttps://t.co/8pm4IKWePb
కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావ్ ,72, గోవా ఆర్చ్ బిషప్, డామన్ మరియు తూర్పు ఇండీస్ ఫాదర్. ఆయన భారత కాథలిక్ బిషప్‌ల సమావేశం మరియు ఆసియా బిషప్‌ల సమావేశాల సమాఖ్య అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.
తిరువనంతపురంలో ఉన్న సిరో-మలంకర కాథలిక్ చర్చి మేజర్ ఆర్చ్ బిషప్ కార్డినల్ బసేలియోస్ క్లీమిస్. ఆయనకు 64ఏళ్లు.
హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోనీ పూల. 63ఏళ్ల ఈయన ప్రపంచలోనే మొదటి దళిత కార్డినల్‌గా చరిత్ర సృష్టించారు.
కార్డినల్ జార్జ్ జాకబ్ కూవాకాడ్ ఇండియాలో అత్యంత తక్కువ వయసు గల కార్డినల్. 51ఏళ్ల కార్డినల్ చంగనాస్సేరీ స్థానికుడు.
Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్..!
బ్యాలెట్ బాక్స్ వెండి, బంగారు పూత పూసి ఉంటుంది. దాని మీద లాటిన్ భాషలో నేను సుప్రీం పోంటీఫ్‌గా ఎన్నుకుంటాను అని రాసి ఉంటుంది. కార్డినల్స్ వంతులవారీగా వారి ఓటు బ్యాలెట్లను అందులో వేస్తారు. మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చిన అభ్యర్థిని పోప్ గా ప్రకటిస్తారు. ఓటింగ్ రోజుకు నాలుగు సార్లు కొనసాగుతుంది. కొత్త పోప్ సెయింట్ పీటర్స్ బసిలికా సెంట్రల్ బాల్కనీలో తన మొదటి ఆశీర్వాదం అందిస్తారు. ఇలా పోప్ ఎన్నిక జరిగుతుంది. ఓట్లు పోల్ అయ్యాక అతని అంగీకారాన్ని కూడా తీసుకుంటారు. పోప్ గా బాధ్యతలు నిర్వహించడం మీ ఇష్టమేనా అని అడుగుతారు.
(new Pope | Pope Francis | elections | latest-telugu-news| Indian cardinals )