/rtv/media/media_files/2025/04/22/cEO0uhGtPSSfTEnmDtTX.jpg)
Pope Francis
పోప్ ఫ్రాన్సిన్ నిన్న గుండెపోటుతో మృతి చెందారు. ఈయన మరణానికి సంబంధించి డెత్ రిపోర్ట్ ను డాక్టర్ ఆండ్రియా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో ఆయన హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారని...దానికి ముందు కోమాలోకి వెళ్ళారని తెలిపారు. అలాగే పోప్ అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని తెలుస్తోంది.
పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల కాథలిక్ క్రిస్టియన్ల మతగురువు. ఈయన వయసు 88 ఏళ్ళు. ముసలితనం, అనారోగ్య కారణాలతో పోప్ నిన్న చనిపోయారు. నిజానికి ఈయన చాలా రోజుల నుంచీ శ్వాసకోస సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత మార్చిలో డిశ్చార్జి అయ్యారు. 2013లో 16వ పోప్ బెనిడెక్ట్ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో కూడా పోప్ అనారోగ్యం కారణంగా పాల్గొనలేదు.
Also Read : అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ఆదివారం అంత్యక్రియలు...
ఈస్టర్ మర్నాడే పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందారు. పాపల్ పరివర్తనను నియంత్రించే యూనివర్సి డొమినిసి గ్రెగిస్ రాజ్యాంగం ప్రకారం పోప్ మరణించిన వారం రోజులలోపు అతని అంత్యక్రియలు జరగాలి. ఎలాంటి ఆడంబరం లేకుండా తన అంత్యక్రియలను నిర్వహించాలని పోప్ ఫ్రాన్సిస్ ముందుగానే చెప్పారు. అంతేకాదు తనను మట్టిలోనే పూడ్చాలని..ఇన్ స్క్రిప్షన్ పై తన పేరును లాటిన్ భాషలో రాయలని కూడా ఆయన ముందుగానే చెప్పారని తెలుస్తోంది. పోప్ చనిపోయిన తర్వాత తొమ్మిది రోజుల సంతాప దినాలు జరుపుతారు.
ఇక పోప్ మరణించిన 15 నుంచి 20 రోజుల్లో తదుపరి పోప్‌ను ఎన్నుకునే పాపల్ సమావేశం ప్రారంభమవుతుంది. 80 ఏళ్లలోపు కార్డినల్స్ దీనికోసం వాటికన్‌లో సమావేశమవుతారు. పోప్ ఎన్నిక అంతా సీక్రెట్‌గా ఉంటుంది. పోప్ ఎన్నిక సమయంలో సిస్టీన్ చాపెల్ లోపల మీటింగ్‌లో ఉన్నవారు బయట వ్యక్తులతో సంబంధం ఉండకూడదు. పోప్ అభ్యర్థికి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు వచ్చే వరకు వారు బహుళ రౌండ్లలో ఓటు వేస్తారు. కొత్త పోప్ ఎన్నికైన తర్వాత ఆయన తన పాత్రను అంగీకరిస్తున్నారా అని అధికారికంగా అడుగుతారు. ఆయన అంగీకరిస్తే ఆయన ఒక పాపల్ పేరును ఎంచుకోవాలి. సీనియర్ కార్డినల్ డీకన్ సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీలో నిలబడి లాటిన్‌లో హేబెమస్ పాపం అంటే తెలుగలో మనకు పోప్ ఉన్నాడని ప్రకటిస్తాడు. తర్వాత కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో తన అనుచరులను పలకరించి, పోప్‌గా తన మొదటి ఆశీర్వాదాలను అందిస్తారు.
today-latest-news-in-telugu | Pope Francis | death | report
Also Read: RBI: పదేళ్ల పిల్లలకూ బ్యాంక్ అకౌంట్లు..ఆర్బీఐ అనుమతి
Also Read : పోలీసులకు చిక్కిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తెలంగాణకు పయణం!