Bihar: బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ, జేడీయూ పోటీ

బీహార్ కొత్త ప్రభుత్వం కోసం ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అవుతోంది. ఇందులో మంత్రులతో పాటూ స్పీకర్ పదవి కోసం కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. స్పీకర్ పదవి తమకే కావాలంటూ బీజేపీ పట్టుబట్టినట్లు సమాచారం.

New Update
bihar politics

బీహార్ లో ఎన్నికలు అయిపోయాయి. ఎన్డీయే కూటమి అత్యధిక మెజారిటీతో గెలిచింది. జేడీయూ అధినేత నితీశ్ కుమారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఎన్డయే వర్గాలు ఇప్పటికే సూచించాయి. అలాగే భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) కూటమి మధ్య కొత్త మంత్రివర్గ కూర్పుపై తుది ఫార్ములా ఖరారైందని..నితీశ్ కుమారే మళ్ళీ సీఎం అవుతారని చెబుతున్నారు. బీజేపీతరుఫున ఒక ఉపముఖ్యమంత్రిని నియమించాలని నిర్ణయించారని తెలుస్తోంది. అలాగే మంత్రివర్గంలో జేడీయూ, బీజేపీల మధ్య కీలక శాఖలు, మంత్రి పదవుల కేటాయింపులో దాదాపుగా సమతుల్యత పాటించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో బీజేపీ, జేడీయూ నేతలు సమావేశమవుతున్నారు. ఇందులో మరో ముఖ్యమైన అంశం బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవి.

స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్న బీజేపీ, జేడీయూ..

బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వ నిర్మాణాన్ని ఖరారు చేయడానికి తీవ్రమైన చర్చలు ఊపందుకుంటున్న నేపథ్యంలో బీజేపీ, జేడీ (యు) పార్టీలు అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నాయని తెలుస్తోంది. ఈ రోజు జరిగే సమావేశంలో దీని కోసం ఫైటింగ్ తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవిని నిలుపుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీలో బీజేపీకి చెందిన నంద కిశోర్ యాదవ్ స్పీకర్ గా, జేడీయూ కు చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. ఈ సారి కూడా ఇదే కొనసాగించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అయితే జేడీయూ మాత్రం ఈసారి స్పీకర్ పదవి తమకే దక్కాలని అంటోంది. దీనికి సంబంధించి వ్యూహంపై చర్చించడానికి రాష్ట్ర బీజేపీ నాయకులు పాట్నాలో అర్థరాత్రి చర్చలు జరిపారు. అలాగే జెడియు నాయకులు సంజయ్ కుమార్ ఝా, లాలన్ సింగ్ సహా కొందరు ఉన్నత స్థాయి చర్చలలో పాల్గొనడానికి ఈరోజు ఢిల్లీకి వెళుతున్నారు.

మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంకీర్ణంలోని చిన్న మిత్రపక్షాలు -- చిరాగ్ పాశ్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జితన్ రామ్ మాంఝీ యొక్క హిందుస్థానీఅవామ్ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహా తాలూకా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలతో సమాంతర చర్చలు జరిపారు. కొత్త ప్రభుత్వంలో వారి పాత్రలకు సంబంధించి మూడు కీలక భాగస్వాములతో ఒక ఒప్పందం కుదిరిందని వర్గాలు సూచిస్తున్నాయి. ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించే ఫార్ములాకు ఎన్డీయేపార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.

ఇక ఈరోజు ఢిల్లీలో బీజేపీ, జేడీయూ రెండింటితో వేర్వేరుగా శాసనసభా పక్ష సమావేశాలు జరగనున్నాయి. దాని తర్వాత మొత్తం ఎన్డీయే కలిసి ఉమ్మడి సమావేశం జరుగుతుంది. నవంబర్ 20న బీహార్ లో ఎలా అయినా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎన్డీయే భావిస్తోంది. బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్‌తో పాటు, ఇతర క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read: India-US: ముగింపుదశకు చేరుకున్న అమెరికా-భారత్ వాణిజ్య డీల్..టారిఫ్ లపై కూడా తగ్గింపు?

#bjp #politics #speaker #bihar #jdu #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు