Maharastra: ఒక్కటైతున్న పొలిటికల్ ఫ్యామిలీస్.. మహారాష్ట్రలో BJPకి మూడిటన్లే

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు బద్ధశత్రువులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు మనుగడ కోసం తిరిగి ఒక్కటవుతున్నాయి. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు విభేదాలు పక్కనపెట్టి చేతులు కలపగా, ఇప్పుడు పవార్ కుటుంబంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

New Update
maharashtra political family

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు బద్ధశత్రువులుగా, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు తమ మనుగడ కోసం తిరిగి ఒక్కటవుతున్నాయి. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు 20 ఏళ్ల విభేదాలను పక్కనపెట్టి చేతులు కలపగా, ఇప్పుడు పవార్ కుటుంబంలో కూడా అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని NCP, ఆయన బాబాయ్ శరద్ పవార్ నేతృత్వంలోని NCP-SP పార్టీలు రాబోయే పింప్రి-చిన్చ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ఈ మేరకు అజిత్ పవార్ స్వయంగా ప్రకటించారు. ముక్కలైతేనే ముప్పే అనే విషయాన్ని తెలుసుకొని ఈ కుటుంబాలు, తమ రాజకీయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి పాత గొడవలను మర్చిపోతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని పవార్ కుటుంబం మరోసారి నిరూపించింది. ఈ 'పరివార్' కలయిక మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో జనవరి 16న చూడాలి. ఇది మహారాష్ట్రలో బీజేపీ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారే అవకాశం ఉంది. 

‘ముక్కలైతేనే ముప్పు’ కాన్సెప్ట్

మహారాష్ట్రలోని ఠాక్రేలు, పవార్‌ ఫ్యామిలీలు రాజకీయంగా తిరిగి కలవడానికి వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి.

అస్తిత్వ పోరాటం: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని 'మహాయుతి' కూటమి ఘనవిజయం సాధించడంతో విడిపోయిన ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డాయి. తమ ఉనికిని కాపాడుకోవాలంటే చీలిపోయిన ఓటు బ్యాంకును తిరిగి ఏకం చేయడం ఒక్కటే మార్గమని వీరు భావిస్తున్నారు.
చీలిపోయన మరాఠీ ఓటు బ్యాంకు: శివసేన, NCP పార్టీలు రెండుగా చీలిపోవడం వల్ల మరాఠీ ఓట్లు వివిధ గ్రూపుల మధ్య విడిపోయాయి. ఇది ఫైనల్‌గా బీజేపీకి కలిసొచ్చింది. దీనిని అడ్డుకోవడానికి మరాఠీల ఐక్యత కార్డు వాడుతూ కుటుంబాలు ఒక్కటవుతున్నాయి.
వారసత్వ రాజకీయాల రక్షణ: ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వంటి నేతలు తమ సొంత పార్టీలను స్థాపించి లేదా చీల్చి, అసలైన వారసులమని చెప్పుకుంటున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆ పార్టీల రాజకీయ వారసులు (ఠాక్రే సోదరులు లేదా శరద్ పవార్ ఫ్యామిలీ) ఏకం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఠాక్రే బ్రదర్స్ ఒక్కటై..

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ముంబై స్థానిక ఎన్నికల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. "మహారాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం" అని రాజ్ ఠాక్రే ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇది కేవలం ఎన్నికల పొత్తు మాత్రమే కాదు, బాలీవుడ్, పారిశ్రామిక కేంద్రమైన ముంబైపై పట్టు కోల్పోకుండా ఉండటానికి తీసుకున్న నిర్ణయం.

పవార్ పరివార్‌లో మార్పులు

శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్నప్పటికీ, కుటుంబ పరంగా వారు మళ్లీ దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో ఉన్నా, ఫ్యామిలీ ఫంక్షన్లు,  కుటుంబం విషయానికి వచ్చే సరికి వారంతా ఒక్కటవుతున్నారని, అది భవిష్యత్తులో రాజకీయ విలీనానికి దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2023లో ఎన్‌సీపీ పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత, బాబాయ్-అబ్బాయిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ యుద్ధం జరిగింది. అయితే, తాజా మున్సిపల్ ఎన్నికల వేళ పరివార్ మళ్ళీ ఒక్కటైంది అంటూ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అజిత్ పవార్ వర్గానికి చెందిన 'గడియారం' గుర్తు, శరద్ పవార్ వర్గానికి చెందిన రంపిట్ గుర్తు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. నామినేషన్ల గడువు డిసెంబర్ 30తో ముగియనుంది. జనవరి 15, 2026న ఈ ఎన్నికలు జరగనున్నాయి. 

పవార్ ఫ్యామిలీ కలిసిపోడానికి కారణం..

పింప్రి-చిన్చ్‌వాడ్ ప్రాంతం పవార్ కుటుంబానికి కంచుకోట. ఇక్కడ బీజేపీ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి, ఓట్లు చీలిపోకుండా పవార్ ఫ్యామిలీ ఒక్కటవ్వాలని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, పవార్ ఫ్యామిలి ఒక్కటి కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని అజిత్ పవార్ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు