BIG BREAKING: రాజకీయాలకు మాజీ మంత్రి మల్లారెడ్డి గుడ్ బై?

మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయలకు త్వరలోనే గుడ్ బై చెప్పనున్నారు. నాకు 73 సంవత్సరాలు వచ్చాయి.. ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముంది. ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే అయిన ఇంకా మూడేళ్లు ఉంటాను. ఇక రాజకీయాలు వద్దు.. ప్రజలకు సేవ చేద్దామనుకుంటున్నానని తెలిపారు.

New Update
Malla Reddy

Malla Reddy

మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా బీజేపీ వైపు లేదా టీడీపీ వైపు.. టీఆర్ఎస్ వైపు అన్నది కాదన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నాను.. తాను ఏ పార్టీ వైపు చూసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముందని మల్లారెడ్డి అన్నారు. ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యే అయిన ఇంకా నేను మూడేళ్లు ఉంటానని మల్లారెడ్డి తెలిపారు. అసలు రాజకీయాలే వద్దని అనుకుంటున్నాను. ఇక ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని భావిస్తున్నాని మల్లా రెడ్డి తెలిపారు.

ఇది కూడా చూడండి: Telangana: రాఖీ పండగ పూట తెలంగాణ మహిళలకు అదిరిపోయే న్యూస్.. వారికి 4 ఎకరాలు ఇవ్వనున్న రేవంత్ రెడ్డి

ఇది కూడా చూడండి: KTR vs Bandi Sanjay :  బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్‌.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్

మల్లారెడ్డి విద్యా సంస్థలు స్థాపించి..

మల్లారెడ్డి మాములు వ్యక్తి నుంచి ప్రముఖ రాజకీయ నాయకుడుగా ఎదిగారు. ఎన్నో విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో జన్మించిన మల్లారెడ్డి కష్టపడి పైకి వచ్చారు. చిన్నతనంలో పాల వ్యాపారం చేస్తూ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత విద్యారంగంలో రాణించాలని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ను స్థాపించారు. ఇందులో ఇంజినీరింగ్, మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు, యూనివర్సిటీ కూడా ఉంది. 

తెలుగు దేశం పార్టీ నుంచి ప్రారంభించి..

మల్లారెడ్డి మొదటగా తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా మల్లారెడ్డి నిలిచారు. అయితే అప్పుడు టీడీపీలో ఉండకుండా 2016లో టీడీపీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం ఉన్న బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 2019లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో మల్లారెడ్డికి స్థానం కల్పించారు. కార్మిక, ఉపాధి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. 

విద్యా సంస్థలపై..

తనకు రాజకీయ వారసుడు లేడని 25 శాతమే రాజకీయంపై ఆసక్తి ఉంటుందని, ఫోకస్ మొత్తం విద్యా సంస్థలపైనే ఉందని గతంలో ఒకసారి మల్లారెడ్డి అన్నారు. యూనివర్సీటిలు కొన్ని తరాలు అయినా ఉంటాయి.. చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. విద్యా సంస్థలకు పిల్లలంతా వారసులేనని, అందరికీ అధికారం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లు, ఇంజనీర్లను తయారు చేయడమే తన జీవిత లక్ష్యం అన్నారు.  కేసీఆర్ హయాంలో తాను లేబర్ మినిస్టర్ గా అద్భుతంగా పనిచేశానన్నారు. 

Advertisment
తాజా కథనాలు