/rtv/media/media_files/2025/08/06/chiranjeevi-2025-08-06-12-34-24.jpg)
పొలిటికల్ ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి కీలక కామెంట్స్ చేశారు. రాజకీయాలకు నేను పూర్తిగా దూరంగా ఉన్నానన్న చిరు.. కొందరు నేతలు తనను ఇంకా విమర్శిస్తూనే ఉంటారని అన్నారు. రాజకీయ విమర్శలపై నేను పెద్దగా స్పందించనని చెప్పారు. తనపై ఓ నేత విమర్శలు చేస్తే రాజమండ్రిలో ఓ మహిళ అడ్డుకొని నిలదీసిందని చిరంజీవి అన్నారు. నాపై చెడు రాతలు..మాటలకు నేను చేసే మంచే సమాధానమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ఫీనిక్స్ ఫౌండేషన్ వైద్య శిబిరంలో పాల్గొన్న చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు.
సోషల్ మీడియాలో నా మీద జరిగే దాడిపై నేను మాట్లాడను - మెగాస్టార్ చిరంజీవి pic.twitter.com/VEJwyi04HC
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2025
తాను చేసిన సేవా కార్యక్రమాలు, ప్రేమాభిమానాలే తనకు రక్షణ అని వెల్లడించారు. తాను మాట్లాడనక్కర్లేదు, తాను చేసిన మంచే మాట్లాడుతుందని చిరంజీవి తెలిపారు. మంచి చేస్తూ.. మంచి చేసే తమ్ముళ్లకు సహకరించడమే తనకు తెలుసనని చిరంజీవి చెప్పుకొచ్చారు.
chiranjeevi Video
రీఎంట్రీపై చాలా కాలంగా చర్చ
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఆయన అనేక సందర్భాల్లో స్పష్టత ఇచ్చారు. తాను ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, పూర్తిగా సినీ రంగంపైనే దృష్టి పెడుతానని చెప్పారు. తన రాజకీయ ఆశయాలను తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తున్నారని కూడా స్పష్టం చేశారు. అయితే కొన్ని సంఘటనలు మళ్లీ ఈ చర్చకు దారితీశాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చిరు
చిరంజీవి తరచుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలుస్తుండటంతో ఆయన పొలిటికల్ రీఎంట్రీ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజున ప్రధాని మోదీ స్వయంగా చిరు, పవన్ చేయిపట్టుకుని ఆప్యాయంగా మాట్లాడటంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిరంజీవి కలుసుకోవడంతో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని చిరంజీవి వర్గాలు స్పష్టం చేశాయి.చిరంజీవి రాజకీయాల్లోకి తిరిగి వస్తారనే ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ, ఆయన మాత్రం తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, కళామ తల్లి సేవలోనే కొనసాగుతానని స్పష్టంగా చెబుతున్నారు.
సినిమాలపైనే ఫోకస్
కేంద్ర మంత్రిగా పనిచేశాక రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ చేశారు. ప్రస్తుతం చిరు విశ్వంభర సినిమా షూటింగ్ లో ఉన్నారు. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు చిరు. లైనప్ లో మరికొన్ని సినిమాలున్నాయి.
Also Read : Fake Marriage: పెళ్లైన 10 రోజులకే వధువు జంప్.. ఇన్‌స్టాలో ఆ వీడియోలు చూసి భర్త మృతి