Karnataka: ఢిల్లీకి క్యూ కట్టిన కన్నడ నేతలు.. రసకందాయంలో కర్ణాటక రాజకీయాలు

కర్ణాటక రాజకీయాలు బాగా వేడెక్కాయి. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ అధికార పంపిణీ రసకందాయంలో పడింది. సిద్ధ రామయ్య సర్కారుకు రెండున్నరేళ్ళు నిండడంతో డీకేకు పదవి కట్టబెట్టాలంటూ నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు.

New Update
karnataka

కర్ణాటక(karnataka)లో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్(congress) గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ సమయంలో రెండున్నర ఏళ్ళ తర్వాత అధికార పంపిణీ ఉంటుందని చెప్పింది. దీంతో సిద్ధ రామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈరోజు సిద్ధరామయ్య సర్కారుకు రెండున్నరేళ్ళు నిండాయి. దీంతో సీఎం పదవిని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(dk-siva-kumar) కు ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బీహార్ ఎన్నికల పరాభవంతో కామ్ గా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కర్నాటకను పట్టించుకోవడం లేదు. కానీ సిద్ధ రామయ్య, డీకే మద్దతుదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. 

Also Read :  బురఖా ధరించి.. కత్తి ఎక్కుపెట్టి.. భర్తను లేపేసిన భార్య

వదిలే ప్రసక్తే లేదు..

సిద్ధరామయ్య తన సీఎం కుర్చీని పదిలంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే..డీకే శివకుమార్ గద్దెనెక్కాలని ఆరాటపడుతున్నారు. దీని కోసం ఎవరికి వారే తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలైన మర్నాడే సీఎం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. అక్కడ రాహుల్ గాంధీ, ఏఐససీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో మంతనాలు జరిపారు.  మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలా చేస్తే..మరో ఏడాదిపాటూ తన సీఎం పదవికి ఢోకా ఉండదని ఆయన భావించారు. అయితే దీనిపై ఖర్గే ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు. అధికార పంపిణీ అంశాన్ని మొదటి నుంచీ తోసిపుచ్చుతున్న సిద్ధరామయ్య ఐదేళ్లూ సీఎంగా తానే కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కర్ణాటకలో ఉన్న 139 మంది ఎమ్మెల్యేలు తనకే మద్దుతుగా ఉన్నారని చెబుతున్నారు. 

న్యాయంగా నాకే రావాలి..

మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై డీకే శివకుమార్ అసహనంగా ఉన్నారు. తన బాధలు, డిమాండ్లు చెప్పుకోవడానికి నిన్న మద్దతుదారులతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. ఈరోజు డాక్టర్‌ రంగనాథ్, బాలకృష్ణ, ఇక్బాల్‌ హుస్సేన్, గుబ్బి శ్రీనివాస్‌ ఎమ్మెల్యేలతో పాటూ   మరో పది మంది ఎమ్మెల్యేల బృందం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను  కలవనున్నారు. దీని కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా తాను ఎక్కువ రోజులు కొనసాగలేనని డీకే సంకేతాలిచ్చారు. 

దిక్కు తోచని స్థితిలో అధిష్టానం..

అయితే వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ..బీహార్ లో దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇప్పుడు కర్ణాటక విషయం పట్టించుకునే స్థితిలో లేదని తెలుస్తోంది. దాంతో పాటూ ఇప్పుడు దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో నాయకత్వాన్ని మారిస్తే వ్యతిరేకత వచ్చి 2028 ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తోంది. పైగా సిద్ధరామయ్యను తప్పిస్తే గందరగోళం ఏర్పడవచ్చని..ఆయనకు బలంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులూ గొడవ చేయవచ్చని భావిస్తోంది. కానీ డీకే శివకుమార్ మాత్రం వదిలేలా కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుందని సమాచారం. 

Also Read: Gold and Silver: గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర

#telugu-news #congress #politics #karnataka #latest-telugu-news #dk-siva-kumar #today-latest-news-in-telugu #national news in Telugu
Advertisment
తాజా కథనాలు