PM Modi: హ్యాపీ బర్త్ డే రేవంత్... మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి. పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి. పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు విషెష్ తెలియజేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సీతక్క, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విషెష్ చెప్పారు.
నేడు బీజేపీ అగ్రనేత, వ్యవస్థాపక సభ్యుడు, భారత మాజీ ఉప ప్రధాని మంత్రి ఎల్‌కె అద్వానీ పుట్టిన రోజు కావడంతో.. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలిపారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు అనంతమని, అందుకే భారత రత్న ప్రదానం చేశారని తెలిపారు.
పవన్ కల్యాణ్ ను దక్షిణాదిలో బీజేపీ ఐకాన్ గా మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులోనూ స్టాలిన్ కు ధీటైన అస్త్రంగా పవన్ ను ఉపయోగిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు అమిత్ షాతో పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
2036 ఒలింపిక్స్ క్రీడలకు అతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. నిర్వాహణకు సంబంధించి IOCకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను సమర్పించినట్లు సమాచారం. 2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.
కెనడాలో హిందూ భక్తులు, దేవాలయంపై జరిగిన దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. 'మన దౌత్యవేత్తలను బెదిరించేందుకే ఈ పిరికి ప్రయత్నాలు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాలను ఎప్పటికీ బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయంవైపే ఉంటుందని ఆశిస్తున్నా' అన్నారు.
ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువతను రిక్రూట్మెంట్ మాఫియాకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. పేపర్ లీక్‌లు చేస్తూ నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తోందని చాయిబస సభలో మండిపడ్డారు. ఝార్ఖండ్‌లో పేదరికాన్ని తాము నిర్మూలిస్తామన్నారు .
ప్రధాని మోదీ, అమిత్ షాకు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన లేఖ రాశారు. ‘మోదీ, షా మీకో దండం. రాష్ట్రానికి రావాల్సిన రూ.1.36లక్షల కోట్లు బొగ్గు బకాయిలను వెంటనే క్లియర్ చేయండి. ఆదాయం లేక రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు’ అని రిక్వెస్ట్ చేశారు.
తెలంగాణలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజే రెండు హామీలను అమలు చేశామని.. అలాగే రైతులకు రూ.2 లక్షల లోపు మాఫీ చేశామంటూ ట్వీట్ చేశారు.