/rtv/media/media_files/2025/02/14/modi-trump-new-photos.jpg)
ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్ భారత్, ప్రధాని మోదీ గురించి మరోసారి వ్యాఖ్యలను చేశారు. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జులో జరుగుతున్న ఎపెక్ సీఈవో సదస్సులో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ భారత్ గురించి ప్రస్తావించారు. భారత్తో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని.. ఒప్పందంపై పని చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే రెండు దేశాలు ఒక అంగీకారానికి వస్తాయని చెప్పారు. ప్రధాని మోదీపై తనకు అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నాయని ట్రంప్ అన్నారు. మోదీ చూడ చక్కని వ్యక్తి. మంచి తండ్రి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కానీ చాలా కఠినాత్ముడు, జెయింట్ కిల్లర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
నేనే యుద్ధం ఆపాను..మళ్ళీ అవే మాటలు..
దీంతో పాటూ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ అదే పాత పాట పాడారు. ‘ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 7, 10 మధ్యలో 7 కొత్త విమానాలు కూలాయి అన్నారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని..వాణిజ్యాన్ని పెట్టుకుని ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేశానని ట్రంప్ చెప్పారు. నేను మోదీకి ఫోన్ చేశాను. మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోనని చెప్పా. ఆయన వద్దని కోరారు. పాకిస్తాన్ తో యుద్ధం మానకపోతే వాణిజ్య ఒప్పందం ఉండదని చెప్పాను. దీని తరువాత పాక్ ప్రధానికి కూడా ఫోన్ చేశాను. భారత్‌తో యుద్ధం చేస్తున్నందున వాణిజ్య ఒప్పందం చేసుకోబోమని చెప్పా. కానీ యుద్ధం చేసుకుంటామని రెండు దేశాలు తెలిపాయి. రెండు రోజులు కాగానే భారత్, పాకిస్థాన్ నాకు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపేస్తున్నామని చెప్పాయి అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
జిన్ పింగ్ తో చర్చలు..
ఇక ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుసాన్ లో చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో సమావేశం కానున్నారు. ఇరు దేశాధినేతలూ ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఆరు ఏళ్ళ తర్వాత ట్రంప్, జెన్ పింగ్ లు మొదటిసారి వ్యక్తిగత సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సుంకాలు, టెక్నాలజీ, రక్షణ వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటిపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. జెన్ పింగ్ తో సమావేశం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్, జిన్ పింగ్ లు ప్రధానంగా ఇరు దేశాల మధ్యనా వాణిజ్య యుద్ధంపై ప్రధానంగా చర్చించనున్నారు. నవంబర్ నుంచి చైనా దిగుమతులపై 100 శాతం సుంకాలను అమలు చేయనుంది. దాంతో పాటూ ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్ధంలో చైనా సహకారం గురించ కూడా చర్చించనున్నారు. రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజింగ్ సహకరించాలని ట్రంప్ కోరనున్నారు.
Also Read: Work Permit: వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు..భారతీయులకు పెద్ద దెబ్బ
Follow Us