IND-USA: వచ్చే ఏడాది ఇండియా వస్తా.. ట్రంప్

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో బిగ్ మూవ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. తాను వచ్చే ఏడాది ఇండియాకు వస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.

New Update
trump-ind

భారత్ తో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుటుట్రంప్ తెలిపారు. మోదీ తనకు మంచి ఫ్రెండ్ అని మరోసారి ఉద్ఘాటించారు. మేము మాట్లాడుకుంటుంటాము. నా మాట విని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం తగ్గించారు. ప్రధాని మోదీ చాలా గొప్ప వ్యక్తి.. నన్ను వారి దేశానికి ఆహ్వానించారు. వచ్చే ఏడాది అక్కడకు కచ్చితంగా వెళ్తానుఅనిట్రంప్ చెప్పారు. అయితే ఎప్పుడు వస్తారు అనేది మాత్రం వివరాలు చెప్పలేదు. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తున్నందున భారతదేశాన్ని సందర్శించే ప్రణాళికలను ధృవీకరించారు. రెండు వైపులా ట్రేడ్ డీల్ లోని మొదటి దశను ఖరారు చేయాలని ప్రయత్నిస్తున్నామని ట్రంప్ చెప్పారు.

Also Read :  USA: ఇప్పటి వరకు 80 వేల వీసాలు రద్దు..అక్రమ వలసలపై అమెరికా ఉక్కుపాదం

చర్చలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి..

ప్రధాని మోదీ(PM Modi) పట్ల అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) కు అమిత గౌరవం అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్లీవిట్ అన్నారు. ఇరువురూ తరుచూ మాట్లాడుకుంటారని చెప్పారు. భారత వాణిజ్య బృందంతో చాలా తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అధ్యక్షుడు భారత్ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని...రెండు దేశాల దౌత్య సంబధాలను మరింత బలోపేతం చేసేందుకు యోచన చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా భారత్, అమెరికాలు ఇప్పటి వరకు 5 రౌండ్లు చర్చలు జరిపారు. ట్రేడ్ డీల్ లో మొదటి దశ ఒప్పందాన్ని నవంబర్ 2025 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారని తెలిపారు.

Also Read :  Lucky Draw: దుబాయ్‌లో బిగ్‌ టికెట్‌ ఈ డ్రా: భారతీయుడికి పావుకేజీ బంగారం

Advertisment
తాజా కథనాలు