Harleen Deol : ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?

మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.

New Update
modi team india

మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ అధికారిక సమావేశంలోనే ఓ సరదా సంఘటన చోటుచేసుకుని, అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రతి ప్లేయర్‌తో ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో, యంగ్ టాపార్డర్ బ్యాటర్ హర్లీన్ డియోల్(Harleen Deol) వంతు వచ్చింది.

Also Read :  IND VS AUS: తడబడిన భారత్.. ఆస్ట్రేలియా ముందు టార్గెట్ ఎంతంటే?

ఊహించని ప్రశ్న అడిగి

హర్లీన్ మైక్ అందుకుని ఊహించని ప్రశ్న అడిగి అందరి దృష్టిని ఆకర్షించింది. సార్, మీరు ఎప్పుడూ చాలా గ్లోగా కనిపిస్తారు. మీ స్కిన్‌కేర్ రొటీన్  ఏంటో మాకు చెప్పగలరా అని నవ్వుతూ అడిగింది. హర్లీన్ అడిగిన ఈ చిలిపి ప్రశ్నకు ప్రధాని మోదీతో సహా, జట్టు సభ్యులు, కోచ్‌లంతాబిగ్గరగా నవ్వారు. ఆ గది అంతా ఒక్కసారిగా సరదా వాతావరణంతో నిండిపోయింది. ఊహించని ఈ  ప్రశ్నకు ప్రధాని మోదీ కూడా చిరునవ్వుతో స్పందించారు.

Also Read :  అర్ష్‌దీప్‌ను అందుకే పక్కన పెట్టాం: టీమిండియా బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

తాను నిజంగా ఈ విషయంపై అంతగా దృష్టి పెట్టలేదన్నారు. వెంటనే జట్టులోని మరో క్రీడాకారిణి సార్, అది దేశంలోని కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీర్వాదాల వల్లే ఆ గ్లో వచ్చిందని అనడంతో మళ్లీ నవ్వులు రెట్టింపయ్యాయి. ఈ సరదా సంభాషణలో జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ కూడా పాలుపంచుకున్నారు. "చూశారుగా సార్, ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వాలతో నేను రోజు వ్యవహరించాల్సి వస్తోంది. అందుకే నా జుట్టు త్వరగా తెల్లబడింది!" అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు