Modi-Trump: మోదీ- ట్రంప్‌ భేటీపై సంచలన అప్‌డేట్

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.

New Update
Modi -Trump

Modi -Trump

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. అయితే ఈ సదస్సుకు భారత ప్రధాని మోదీ, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) హాజరుకానున్నట్లు గతంలో ప్రచారం నడిచింది. ఈ సమావేశంలో ట్రంప్, మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రధాని మోదీ(PM Modi) ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. షెడ్యూల్ సమస్య ఉండటం వల్లే మోదీ దీనికి హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వీ.. అధికారికంగా ప్రకటించిన గెహ్లాట్!

Modi To Skip Asean Summit

అయితే మోదీకి బదులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ భారత్‌ తరఫున ప్రాతనిధ్యం వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో అక్కడ జరగనున్న ఆసియన్ సదస్సులో వర్చువల్‌గా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సు సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ సదస్సుకు వెళ్లకపోవడంతో ఆయన కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఇక ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు చాలా దేశాల నాయకులు పాల్గొననున్నారు.  

Also Read: గాల్లోనే ఇండిగో ఫ్లైట్ ఇంధన లీకేజీ.. గజగజ వణికిపోయిన 166 మంది ప్రయాణికులు

ఇదిలాఉండగా ఈ ఆసియన్‌ సదస్సులో మలేసియాతో పాటు సింగపూర్, వియత్నాం,  థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌, మయన్మార్‌ లాంటి 10 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా చూసుకుంటే భారత్‌-ఆసియాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి రంగాలతో సహా భద్రత, రక్షణల్లో సహకారంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక మొత్తానికి ట్రంప్, మోదీ భేటీ కాకపోవడంతో టారిఫ్‌లపై మరోసారి సందిగ్ధత నెలకొంది.   

Also Read: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో మహమ్మరి.. తొలి కేసు నమోదు!

Advertisment
తాజా కథనాలు