ASEAN Summit: ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ దూరం.. ట్రంప్‌తో భేటీ క్యాన్సిల్

ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన దీనికి అటెండ్ కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కారణంగా మోదీ, ట్రంప్ మధ్య కూడా భేటీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. 

New Update
modi-trump

PM Modi- Trump

మలేసియా రాధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. భారత ప్రధాని మోదీ దీనికి హజరు కావాల్సి ఉంది. అలాగే అమెరికా నుంచి అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇందులో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాధినేతలూ భేటీ అయ్యేట్టు కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దానికి కారణం భారత ప్రధాని మోదీ ఆసియాన్ సమావేశానికి వెళ్ళకపోవడమే. షెడ్యూల్‌ సమస్యల వల్లే మోదీ ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. అయితే మోదీ వర్చువల్‌గా సదస్సుల్లో పాల్గొనే అకాశం ఉందని చెబుతున్నారు. శిఖరాగ్ర సమావేశానికి మలేసియా వెళ్ళే ముందు ప్రధాని మోదీ కంబోడియా కూడా సందర్శించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పర్యటన కూడా వాయిదా పడింది. ఇక ఈ సదస్సుకు ట్రంప్‌తో సహా అనేక దేశాల నాయకులు హాజరుకానున్నారు. 

10 దేశాలతో ఆసియాన్ కూటమి..

ఈ ఆసియాన్‌ కూటమిలో మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, మయన్మార్‌ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు రెండేళ్ళకొకసారి ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక, రాజకీయ, భద్రత, సామాజిక-సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించి సదస్సును నిర్వహిస్తాయి. కొన్నేళ్ళుగా ఈ అన్ని దేశాలతో భారత్ మంచి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడి రంగాలతో పాటు భద్రత, రక్షణల్లో సహకారంపై కలిసి పని చేస్తున్నాయి. మరోవైపు ఇందులో సభ్య దేశాలైన థాయ్ లాండ్ కంబోడియాల మధ్య ఘర్షణలు తలెత్తగా..వాటిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆపారు. కంబోడియా ఆయనను నోబెల్ పీస్ బహుమతికి కూడా నామినేట్ చేసింది. ఈ కారణంగానే ట్రంప్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు