Cabinet Meeting: ప్రధాని మోదీ నివాసంలో నేడు కేబినేట్ మీటింగ్..
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినేట్ భేటి జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పదవి చేపట్టనున్నవారు హాజరుకానున్నారు.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినేట్ భేటి జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పదవి చేపట్టనున్నవారు హాజరుకానున్నారు.
ఢిల్లీలోని ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గట్టిగా కేకలు వినిపించాయి. దీంతో ఆయన క్రేజ్ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు.
మోదీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడిగా(36) నిలిచారు. ఆతర్వాత అత్యంత పిన్న వయస్కులుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే (37), లోక్‌జన్‌శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ (41) ఉన్నారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కాగా.. 7.23 PM గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో కలిపి మొత్తం 72 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
కేంద్ర కేబినెట్ పదవులపై ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రఫుల్ పటేల్‌కు కేంద్రమంత్రి పదవి కాకుండా సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ స్పష్టం చేయడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రమోషన్ కాదు డిమోషన్ అంటూ వాపోయారు.
నెహ్రూ తర్వాత మూడుసార్లు వరుసగా ప్రధాని అయిన ఘనత కేవలం నేరంద్రమోదీది మాత్రమే. ఇప్పటికే పదేళ్ళు భారత్‌కు ప్రధానిగా పని చేసిన మోదీ మరో ఐదేళ్ళు బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధం అయ్యారు. ఈరోజే మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.
ఈరోజు మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి ప్రతిపక్షాలను తప్ప అందరినీ ఆహ్వానించారు. ఈనేపథ్యంలో బెంగాల్ ఛీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోందని ఆరోపించారు.
ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి గులాబీ అధినేతను ఆహ్వానించారు. కేసీఆర్ వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.