PM Modi: నరేంద్ర మోదీ అనే నేను.. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కాగా.. 7.23 PM గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో కలిపి మొత్తం 72 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. By B Aravind 09 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులతో పాటు పలువురు విదేశీ అధినేతలు కూడా హాజరయ్యారు. Also Read: 52 మంది కేంద్ర మంత్రులు వీరే.. పవన్‌కు మోదీ షాక్ గతంలో తొలి ప్రధాని అయిన జవహార్‌లాల్ నెహ్రూ వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మూడుసార్లు వరుసగా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఎవరికి రాలేదు. అలాంటి అరుదైన ఛాన్స్ ఇప్పుడు నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. 1971లో ఆరెఎస్సెస్ కార్యకర్తగా , ఆ తర్వాత 1985 నుంచి బీజేపీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మోదీ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని స్థాయికి చేరుకున్నారు. Also Read: లోక్‌సభ స్పీకర్‌గా పురందేశ్వరి..! #narendra-modi #bjp #modi-swearing #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి