BIG BREAKING : తెలంగాణలో ఓజీకి బ్రేక్ !
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
OG సినిమాపై ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పవన్ కుమారుడు అకీరా నందన్ ఇందులో చిన్నప్పటి పవన్ పాత్రలో నటించారా? OG సినిమా సాహోతో లింక్ ఉన్న సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా? అనే రెండు ప్రశ్నలకు సమాధానం ఈరోజే ప్రీమియర్ షోలతో రివీల్ కానుంది.
OG టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. PVR INOX మల్టీప్లెక్స్‌లలో బుకింగ్స్ ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే బుకింగ్‌లు రూ.75 కోట్లను దాటి పోయాయి. ప్రీమియర్ షోలతో OG ఫీవర్ టాప్ గేర్‌లో ఉంది.
పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా ప్రీమియర్లు ఈరోజు రాత్రి ప్రారంభం కానుండగా, దర్శకుడు సుజీత్, అకీరా నందన్ బాలానగర్ విమల్ థియేటర్లో సినిమా చూడనున్నారన్న వార్త హల్చల్ చేస్తోంది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా OG సినిమా పండుగలా మారింది.
OG సినిమా ప్రీమియర్ షోస్ విడుదలకు నార్త్ అమెరికాలో కంటెంట్ డెలివరీలో జాప్యం ఏర్పడగా, అభిమానులు స్వయంగా థియేటర్లకు సినిమా డేటా అందించి హీరోలుగా మారారు. ఇప్పుడు OG సినిమాపై విదేశాల్లో కూడా క్రేజ్ తారాస్థాయికి చేరింది.
పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'OG' సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలతో విడుదలకానుంది. ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, అమెరికాలో రికార్డ్ టికెట్ సేల్స్‌తో సినిమాపై క్రేజ్ పీక్స్‌కి చేరింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫీవర్ ఉన్నప్పటికీ ఆయన నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘OG’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమైంది. అన్ని పనులు పూర్తయి కంటెంట్ ఓవర్సీస్కి పంపించారు. సుజీత్, తమన్ చేతులు కలిపిన ఫోటో వైరల్ అవుతోంది. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు.
‘OG’లో శ్రియా రెడ్డి మేకప్ లేకుండా నటించారంటూ వెల్లడించారు. ఆమె పాత్రలో ఎమోషన్, పవర్ ఉన్నాయంటూ తెలిపారు. కెమెరామెన్ సూచనతోనే మేకప్ లేకుండా నటించారట. పవన్ తో షూటింగ్ అనుభవాన్ని కూడా షేర్ చేశారు. Sep 25న సినిమా విడుదల కాబోతోంది.