/rtv/media/media_files/2025/09/23/shriya-reddy-2025-09-23-20-35-09.jpg)
Shriya Reddy
Shriya Reddy: ఇటీవల రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను ఊపేస్తోన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజా చిత్రం ‘OG’ విడుదలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థియేటర్లలో సందడి చేయనుంది. సుజీత్(Director Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ “ఓజస్ గంభీర్” అనే మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించనుంది.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
One of the finest & versatile performer and a beauty queen sriya reddy garu❤️❤️ waiting for your kick ass performance in #OG as Geetha ❤️ @sriyareddy 🙌🏻🙌🏻 pic.twitter.com/Fv5jTCj1qZ
— àkrūthi (@Akruthi94) September 20, 2025
మేకప్ లేకుండా నటించా..
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన శ్రియా రెడ్డి తన పాత్ర గురించి ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, “నా పాత్రలో బాగా ఎమోషన్స్ ఉంటాయి. అదే పాత్రకు పవర్ కలిపితే ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఊహించవచ్చు. ఈ రోల్‌లో ఉన్న లోతు, వివిధ ఎమోషన్స్ పాత్రను చాలా బలంగా చూపిస్తాయి. అందుకే ఈ పాత్రకు మేకప్ లేకుండా నటించాను” అని తెలిపారు.
మేకప్ లేకుండా నటించాలన్న ఆలోచన కెమెరామెన్ రవి కే చంద్రన్ ది అని కూడా ఆమె వెల్లడించారు. పాత్రను ఒరిజినల్ గా చూపించాలని ఆయన అభిప్రాయం. “నాకూ అదే కోరిక ఉంది. పాత్రలో నాటిగా నిజమైన భావోద్వేగాన్ని చూపించాలనిపించింది. అందుకే ఈ నిర్ణయం నాకు సంతోషాన్ని ఇచ్చింది” అని శ్రియా చెప్పారు.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
పవన్ కళ్యాణ్‌తో పనిచేయడం గురించి మాట్లాడుతూ, “ఆయన ఎక్కువగా మాట్లాడే వారు కాదు. నేనూ అంతగా మాట్లాడే వ్యక్తిని కాదు. కానీ షూటింగ్ సమయంలో సినిమాల కంటే వేరే విషయాలపై మాట్లాడాం. రాజకీయాలు పక్కనపెట్టి షూట్‌కు వచ్చేవారన్న విషయం తెలుసు కాబట్టి, నేను ఆయన్ను డిస్టర్బ్ చేయలేదు” అని చెప్పింది.
ఈ సినిమాలో శ్రియా పాత్ర, నటన ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపుతుందో చూడాలి. తమన్ సంగీతం, డీవీవీ దానయ్య నిర్మాణ విలువలు OG సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అవుతాయని ఇప్పటికే ట్రైలర్ చూశాక అందరికీ నమ్మకం వచ్చేసింది.