/rtv/media/media_files/2025/05/27/wCIRh1NR4pOWy51ZK0sJ.jpg)
AP Deputy CM Pawan Kalyan releases sensational statement Photograph: (AP Deputy CM Pawan Kalyan releases sensational statement )
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫీవర్ ఉన్నప్పటికీ ఆయన నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపాయి. ఈరోజు ఆయనకు జ్వరం మరింత పెరిగింది. దీంతో ఆయన వైద్యులను సంప్రదించారని, ఆయనకు తగిన విశ్రాంతి అవసరమని సూచించారని వివరించాయి. దీంతో అధికారిక కార్యక్రమాలను రెండు, మూడు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు పవన్.
Viral Fever to AP DCM Pawan Kalyan
— idlebrain.com (@idlebraindotcom) September 23, 2025
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్ బారినపడ్డారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
సోమవారం రాత్రి…
కొంతకాలంగా బిజీగా పవన్
వపన్ కొంతకాలంగా బిజీ అవుతున్నారు.అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ రెండు మూడు రోజులు అయితే పవన్ గ్యాప్ లేకుండా మరింత బిజీ అయ్యారు. ఒకేసారి అసెంబ్లీ సమావేశాలు, తన ఓజీ సినిమా ఈవెంట్లకు హాజరవుతూ వచ్చారు. ఓజీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ తడుస్తూనే పాల్గొన్నారు. బహుశా ఇలా తడవడంవల్లే ఆయన జ్వరం బారిన పడివుండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఓజి సినిమా రిలీజ్ జోష్ లో ఉన్న మెగా ఫ్యాన్స్ కి పవన్ కల్యాణ్ అనారోగ్యం బాధపెట్టే అంశమేనని చెప్పాలి.
OG సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్‌కి వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పవన్ పవర్‌ఫుల్ లుక్, డైలాగ్స్, యాక్షన్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా, హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరిష్ ఉత్తమన్, సుభలేఖ సుధాకర్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. థమన్ మ్యూజిక్ అందించాడు.