/rtv/media/media_files/2025/09/24/og-movie-2025-09-24-15-37-45.jpg)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పటికే ఈ రోజు రాత్రి 10 గంటలకు పడాల్సిన ప్రీమియర్స్, కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టు తీర్పుతో పవన్ ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది.
ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు
— Telugu Stride (@TeluguStride) September 24, 2025
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్#TheyCallHimOG#Pawankalyan#Telanganapic.twitter.com/w1a55Zdq9G
నైజాంలో సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100, మల్టీప్లెక్స్‌లకు రూ.150 చొప్పున పెంచుకోవచ్చు అంటూ ఇటీవల తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇందుకు టికెట్ ధర రూ.800కు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
టికెట్ ధరల పెంచిన ఏపీ సర్కార్
అటు ఓజీ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే టికెట్ ధరల పెంచింది. సినిమా విడుదలైన తొలి 10 రోజులు (సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు) సాధారణ షోల టికెట్ల ధరలను కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ. 125 అదనంగా పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ. 150 అదనంగా పెంచుకోవచ్చు.