OG Premieres: సుజీత్, అకీరా నందన్ 'OG' ప్రీమియర్ షో చూసేది ఈ థియేటర్ లోనే..

పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా ప్రీమియర్లు ఈరోజు రాత్రి ప్రారంభం కానుండగా, దర్శకుడు సుజీత్, అకీరా నందన్ బాలానగర్ విమల్ థియేటర్‌లో సినిమా చూడనున్నారన్న వార్త హల్‌చల్ చేస్తోంది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా OG సినిమా పండుగలా మారింది.

New Update
OG Premieres

OG Premieres

OG Premieres: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘OG’ మినీ ఫెస్టివల్‌లా మారిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌లో జోష్ తారాస్థాయికి చేరింది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి పేయిడ్ ప్రీమియర్ షోలు మొదలుకానుండగా, అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. 

Also Read: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

ఇప్పటికే ట్రైలర్‌, పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. పవన్ ఈ సినిమాలో ముంబై గ్యాంగ్‌స్టర్ ‘ఓజస్ గంభీర్’ పాత్రలో కనిపించబోతున్నారు. ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు సుజీత్ మాస్ యాంగిల్‌ లో పవన్ ను చూపించనున్నాడు. 

ఇక ఫ్యాన్స్‌లో మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 'OG' టీం హైదరాబాద్‌లో ఎక్కడ సినిమా చూస్తుందో అని. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు సుజీత్(Director Sujeeth), పవన్ కుమారుడు అకీరా నందన్(Akira Nandan), ఇంకా కొంత మంది సినీ ప్రముఖులు కలిసి హైదరాబాద్ బాలానగర్‌లోని విమల్ థియేటర్‌లో OGను చూడబోతున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

భారీ తారాగణం 

ఈ సినిమాకు గ్లామర్ జోడిస్తున్నవారు చాలామంది ఉన్నారు. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అలాగే శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ భారీ సినిమాకు సంగీతం అందించిన తమన్ ఇప్పటికే విడుదలైన పాటలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. సినిమాను DVV ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై DVV దానయ్య అత్యున్నత బడ్జెట్‌తో నిర్మించారు.

Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!

ప్రపంచవ్యాప్తంగా OG ఉత్సవం..

సినిమా తెలుగుతో పాటే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో OG ప్రీమియర్లు గ్రాండ్‌గా జరగనున్నాయి. అమెరికాలో కొన్ని చోట్ల అభిమానులు స్వయంగా థియేటర్లకు కంటెంట్ అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ రాత్రి OG ఫీవర్ మొదలవుతుంది… మీరు సిద్ధమేనా? 

Advertisment
తాజా కథనాలు