Thaman OG: ఇది కదా మాస్ అంటే.. కొణిదెల తమన్ అస్సలు తగ్గడం లేదుగా..!

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘OG’ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమైంది. అన్ని పనులు పూర్తయి కంటెంట్ ఓవర్సీస్‌కి పంపించారు. సుజీత్, తమన్ చేతులు కలిపిన ఫోటో వైరల్ అవుతోంది. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు.

author-image
By Lok Prakash
New Update
Thaman OG

Thaman OG

Thaman OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘OG’ ఇప్పుడు విడుదలకు రెడీ అయింది. ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్‌కి వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పవన్ పవర్‌ఫుల్ లుక్‌, డైలాగ్స్‌, యాక్షన్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి.

తాజాగా ‘OG’ చిత్ర బృందం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసి, కంటెంట్‌ను ఓవర్సీస్‌కి పంపేసింది. దీంతో అమెరికాలో ప్రీమియర్ షోస్‌కు ఊరట లభించింది. ఇండియాలో కూడా పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించబోతున్నారు. టికెట్ బుకింగ్‌ లింకులు ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ సుజీత్(Director Sujeeth), మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కలిసి చేతులు కలుపుకుని దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ గత కొన్ని రోజులుగా నిద్ర లేకుండా పని చేస్తూ చివరికి సినిమాను టైమ్‌కి పూర్తి చేశారు.

ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా, హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరిష్ ఉత్తమన్, సుభలేఖ సుధాకర్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని, భారీ అంచనాల మధ్య ‘OG’ విడుదలకు సిద్ధమైంది.

Advertisment
తాజా కథనాలు