OG Records: 'OG' అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్స్ బ్రేక్: పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌..?

పవన్ కళ్యాణ్ OG సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో రూ.75 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇది పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.

New Update
OG Records

OG Records

OG Records: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘OG - They Call Him OG’ సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అంతకుముందే అంటే సెప్టెంబర్ 24 రాత్రి 09 గంటలకే పేయిడ్ ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా సేల్ అయ్యాయి. ట్రేడ్ వెబ్‌సైట్ Sacnilk నివేదిక ప్రకారం, OG సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 75 కోట్లు వసూలు చేసింది. ఇందులో భారతదేశంలో రూ. 45 కోట్లు, విదేశాల్లో రూ. 30 కోట్లు వచ్చాయి.

Also Read: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

పవన్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్ ? (OG Opening Day Collections)

OG సినిమా పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ గత సినిమా హరిహర వీరమల్లు మొదటి రోజే రూ. 67 కోట్లు రాబట్టగా, OG మాత్రం ఆ రికార్డును తేలికగా బ్రేక్ చేయబోతోంది. మొత్తంగా OG ఓపెనింగ్ డే కలెక్షన్లు రూ. 150 కోట్ల వరకు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.

ఇది పవన్ నటించిన భీమ్లా నాయక్ (2022) లైఫ్‌టైమ్ కలెక్షన్ అయిన రూ.158 కోట్లకు చాలా దగ్గరగా ఉండడం విశేషం. ఈసారి OG ఆ రేంజ్‌ను కూడా దాటే అవకాశముంది.

Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

OG మూవీ విశేషాలు.. 

ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు సుజీత్ దర్శకత్వం వహించగా, DVV ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. పవన్ ఇందులో ఓజస్ గంభీర్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. అతనికి విరుద్ధంగా నడిచే క్రైం బాస్ 'ఒమీ భౌ' పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నారు. ఈ చిత్రంతో ఆయనకు ఇది తెలుగు డెబ్యూట్ కూడా.

హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, అలాగే ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బీజీఎం ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

14 ఏళ్ల తర్వాత 'A' సర్టిఫికేట్

OG సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది పవన్‌కు 14 ఏళ్ల తర్వాత వచ్చిన ‘A’ సర్టిఫికేట్ చిత్రం. 2011లో వచ్చిన ‘పంజా’ తర్వాత ఇది ఆయన నటించిన మరో గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడం విశేషం.

ఇప్పటికే ట్రైలర్, పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన OG, విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది థియేటర్‌లో పవన్ మాస్ ర్యాంపేజ్‌ కోసమే..!

Advertisment
తాజా కథనాలు