/rtv/media/media_files/2025/09/24/og-premiere-show-2025-09-24-12-44-00.jpg)
OG Premiere Show
OG Premiere Show: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘OG’ విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికా, యూకే, ఇతర దేశాల్లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
అమెరికాలో ప్రీమియర్లు షురూ..! (North America OG Premieres)
'OG' సినిమా ప్రీమియర్ షోలు మొదలయ్యే ముందు, ఉత్తర అమెరికా (నార్త్ అమెరికా)లో ఓ పెద్ద సమస్య తలెత్తింది. సినిమా కంటెంట్ (డిజిటల్ ఫైల్) డెలివరీలో డిలే ఏర్పడి, చాలా థియేటర్లలో షోలు రద్దు అయ్యాయి. దీనివల్ల అభిమానులు నిరాశ చెందారు. కానీ ఒక బాధ్యత గల అభిమానిగా ఫ్యాన్స్ ఈ సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు.
Paga ragilina fireuu… Kasi pudithe shatruve shiverruuuuu… 💥💥💥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 24, 2025
The Real OG of Box office is ruling north america #TheyCallHimOG $2.6M+ Premieres Pre Sales… 🔥🔥🔥#OGhttps://t.co/MSpn6ryrw8 🎫 pic.twitter.com/nJfVqseNfd
మీరు కదా అసలైన 'OG'లు..
ఈ కష్ట సమయంలో ఫ్యాన్స్ వెనక్కి తగ్గలేదు. బదులుగా వారు ముందుకొచ్చి OG సినిమా కంటెంట్‌ను సినీమార్క్, AMC వంటి ప్రముఖ థియేటర్లకు స్వయంగా అందించారు. ఎన్‌క్రిప్టెడ్ డ్రైవ్స్‌లో సినిమా ఫైళ్లు తీసుకుని, కొన్ని గంటల వ్యవధిలోనే కంటెంట్ డెలివరీ పూర్తి చేశారు. ఇది చిన్న విషయం కాదు.. ఇది పవన్ అభిమానుల ఆశ, అభిమానం, బాధ్యత.
చాలా మంది అభిమానులు ఈ పని కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వారి సమయానికి అందించిన సపోర్ట్‌తో OG ప్రీమియర్ షోలు నార్త్ అమెరికాలో పడనున్నాయి. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ ‘ఓజస్ గంభీర్’ అనే ముంబై గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు తెరపై పరిచయం అవుతున్నారు.
ఇక శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అందించిన తమన్ ఇప్పటికే పాటలతో హంగామా చేస్తున్నారు. DVV దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు
ఈరోజు రాత్రి 9 గంటల నుండి OG సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. అభిమానుల సహకారంతో అమెరికాలోను OG రచ్చ మొదలైంది. ఈ సినిమా కేవలం ఓ సినిమాగా కాకుండా, ఒక ఉద్యమంలా, అభిమానుల పండుగలా మారింది.
ఈ ఒక్క సంఘటనతో పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు అని తెలుస్తోంది. OG సినిమా విడుదలకున్న హైప్ ఏ రేంజ్ లో ఉందొ అర్థమవుతోంది. ఈ సంఘటన గురించి పవన్ ఫ్యాన్స్ మీరు నిజమైన OGలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్!