OG INOX Tickets: ఇట్స్ "షో టైమ్" PVR INOXలో 'OG' బుకింగ్స్ షురూ..

OG టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. PVR INOX మల్టీప్లెక్స్‌లలో బుకింగ్స్ ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే బుకింగ్‌లు రూ.75 కోట్లను దాటి పోయాయి. ప్రీమియర్ షోలతో OG ఫీవర్ టాప్ గేర్‌లో ఉంది.

New Update
OG INOX Tickets

OG INOX Tickets

OG INOX Tickets: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), దర్శకుడు సుజీత్(Director Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా ‘OG - They Call Him OG’ ఈరోజు రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూడు సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

Also Read: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

అందరికంటే ముందు చూడాలనే ఉత్సాహంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. బుక్ మై షో వేదికగా ఇప్పటికే 6 లక్షల టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇంకా PVR INOX బుకింగ్స్ మొదలవకముందే ఈ స్థాయికి చేరడం నిజంగా పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు నిదర్శనం.

PVR INOX మల్టీప్లెక్స్‌లలో OG..

ఇప్పుడు అభిమానులకు మరో మంచి వార్త. PVR INOX మల్టీప్లెక్స్‌లలో OG టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రారంభం అయ్యాయి. ఈ విషయాన్నీ అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. ఇవాళ రాత్రి ప్రీమియర్ షోలు కోసం కూడా టికెట్లు అదే సమయంలో లభ్యం కానున్నాయి.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

ఇప్పటికే బుకింగ్స్ బాగా స్పీడ్‌గా సాగుతున్నాయి. ప్రీమియర్లు, ఎర్లీ షోల కోసమే ఇప్పటివరకు రూ. 75 కోట్లకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయట. ఇప్పుడు PVR INOX బుకింగ్స్ కూడా మొదలవడంతో రూ. 100 కోట్లు మార్క్‌ను క్రాస్ చేయడం కచ్చితంగా సాధ్యమేనని టాక్.

Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!

సినిమాపై ఉన్న హైప్‌తో ఫ్యాన్స్ ఊపు మీదున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ముంబై గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతుండగా, ఆయనతో కలిసి ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి నటులు కనిపించబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం ఇప్పటికే అభిమానుల్లో మంచి ఊపు తీసుకువచ్చింది. DVV ఎంటర్టైన్‌మెంట్ నిర్మించిన ఈ భారీ సినిమా ప్రీమియర్ షోలతో ఈరోజే OG సంబరం మొదలవుతుంది. మరి మీరు టిక్కెట్టు బుక్ చేసుకున్నారా?

Advertisment
తాజా కథనాలు