/rtv/media/media_files/2025/09/24/og-release-day-2025-09-24-11-28-53.jpg)
OG Premiere Show
OG Premiere Show: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన భారీ యాక్షన్ ఫిల్మ్ ‘OG’ విడుదలకు సిద్ధంగా ఉంది. చాలా కాలంగా పవన్ ను మాస్ యాంగిల్ లో చూడని అభిమానులకు ఈ సినిమా ఒక మాస్ జాతరగా ఉండబోతోందా..? సెప్టెంబర్ 25 న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే క్రేజ్ బాగా పెరిగింది. ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్ తో మళ్లీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి.
Hyped up 🔥🔥 pic.twitter.com/zNdWQSTBJA
— DVV Entertainment (@DVVMovies) September 23, 2025
ట్రైలర్ ఎఫెక్ట్.. (OG Trailer)
ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పవన్ పాత్ర.. ఆ పాత్రలో పవన్ చెప్పే డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నాయి. “వింటేజ్ పవన్ కళ్యాణ్” ని తిరిగి తీసుకొచ్చింది ఈ ట్రైలర్.
పవన్ అభిమానులైతే ఈ ట్రైలర్ చూసి ఫుల్ ఖుషి అయిపోయారు. సినిమా విడుదల సమయం దగ్గరవుతుండగా, అభిమానులలో ఉత్సహం రెట్టింపవుతోంది. సోషల్ మీడియా పోస్టర్లు, షార్ట్ క్లిప్స్, గ్లింప్స్.. ప్రతి అప్ డేట్ అభిమానులకు ట్రీట్ లా మారుతున్నాయి. “OG Concert”లో పవర్‌స్టార్ వేదికపై చేసిన హంగామా అభిమానులతో కనెక్ట్ అయ్యిన విధానం అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఈ ప్రాజెక్ట్ డీసెంబర్ 2022లో DVV ఎంటర్టైన్మెంట్స్ ద్వారా “BIG ANNOUNCEMENT” తో ప్రారంభమైంది. Sujeeth ఈ మూవీకి డైరెక్టర్ అని తెలియగానే ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రాజకీయాల్లో బిజీ అయి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా పనులు ఆలస్యం చేయలేదు. రాజకీయాలను, సినిమాను బ్యాలన్స్ చేసుకుంటూ వచ్చారు.
The boys are all fired up to give everyone a blast of hungama and celebrations 🔥🔥🔥#OG#TheyCallHimOGpic.twitter.com/UYlm19ty6G
— DVV Entertainment (@DVVMovies) September 23, 2025
తమన్ సంగీతం ఈ సినిమా ప్రమోషన్లో కీలక పాత్ర వహించింది. విడుదలైన పాటలు—“Firestorm”, “Suvvi Suvvi”, “Trance of OMI”, “Guns ‘n’ Roses” ఇలా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
ఒక్క పాటలతోనే కాదు సినిమా విడుదల దగ్గర అవుతుండే కొద్ది సినిమాకి సంబంధించిన పోస్టర్లు, క్లిప్స్, ప్రమోషన్ కార్యక్రమాలు ఏదీ మిస్ చేయకుండా చిత్రబృందం సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూనే ఉంది.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
సెన్సేషనల్ ట్రైలర్, పాటలు, ప్రమోషన్ ఈ మూడు అంశాలు ‘OG’ పై అంచనాలను విపరీతంగా పెంచాయి. చాలా కాలం తర్వాత పవన్ పూర్తి స్థాయి యాక్షన్ మాస్ సినిమా చేస్తున్నాడు అని అభిమానులు భావిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, టాలీవుడ్ ప్రేక్షకులందరూ ఎదురుచూసిన సినిమా.
Only DESTRUCTION…….#OGpic.twitter.com/ab7GH89d8Q
— DVV Entertainment (@DVVMovies) September 23, 2025
రెమ్యునరేషన్..
ఈ సినిమా మొదలైనప్పటి నుండి పవన్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ చర్చనీయాంశంగా మారింది. ‘OG’ సినిమా కోసం ఆయన ఏకంగా రూ. 100 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. గతంలో ఆయన చేసే సినిమాలు చూస్తే 60‑70 కోట్ల మధ్య చార్జ్ ఉండేది. 'OG' పవన్ మార్కెట్ మరింత పెరిగింది, OG కోసం అభిమానుల డిమాండ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే చెప్పాలి. నిర్మాత దానయ్య ఈ భారీ అమౌంట్‌ను అంగీకరించడంతో 'OG' ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
అమెరికా premiere show బుకింగ్స్ జోరుగా సాగాయి. చాలా రోజులు ముందుకే టిక్కెట్లు బుకింగ్స్ పూర్తయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే… అభిమానుల కోసం ఈరోజు నుండే ప్రీమియర్లు వేస్తున్నారు.
మొత్తానికి, OG అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా సినిమా. పవన్ అభిమానులు ఎంతోకాలం ఎదురు చూస్తున్న ‘OG Rampage’ ఈరోజు నైట్ ప్రీమియర్ షోల నుండి ప్రారంభం కానుంది.