SAAHO - OG: ‘సాహో’కి 'OG'కి కనెక్షన్..? సుజీత్ సినిమాటిక్ యూనివర్స్..

OG సినిమాపై ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పవన్ కుమారుడు అకీరా నందన్ ఇందులో చిన్నప్పటి పవన్ పాత్రలో నటించారా? OG సినిమా సాహోతో లింక్ ఉన్న సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా? అనే రెండు ప్రశ్నలకు సమాధానం ఈరోజే ప్రీమియర్ షోలతో రివీల్ కానుంది.

New Update
SAAHO - OG

SAAHO - OG

SAAHO - OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), దర్శకుడు(Director Sujeeth) సుజీత్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ మాస్ యాక్షన్ డ్రామా ‘OG – They Call Him OG’ ఈరోజు రాత్రి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో థియేటర్లలోకి రానుంది. DVV దానయ్య, అతని కుమారుడు కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

Also Read: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

అభిమానులు ఈ సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు అభిమానుల్లో రెండు పెద్ద ప్రశ్నలు గట్టిగా మారుమ్రోగుతున్నాయి. వాటికి సమాధానం మాత్రం సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

1. అకీరా నందన్ పాత్ర నిజమేనా?

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఈ సినిమాలో చిన్నప్పటి పవన్ పాత్రలో కనిపించబోతున్నారన్న వార్తలు నెలలుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘ఫైర్‌స్టార్మ్’ పాట విడుదల తర్వాత ఈ ఊహాగానాలు మరింత బలపడినట్లు కనిపిస్తోంది. చిత్రబృందం ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కానీ, అభిమానులు మాత్రం థియేటర్లో ఈ సర్ప్రైజ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!

2. OG - Saaho లింక్..? (Prabhas in Saaho)

OG సినిమా మరో పెద్ద బజ్ ఏంటంటే, ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా అన్నది. సుజీత్ గతంలో తెరకెక్కించిన ‘సాహో’ సినిమాతో OGకి కనెక్షన్ ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా, ప్రభాస్ ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది నిజమా కాదా అన్నది మాత్రం ప్రేక్షకులు సినిమా చూసే వరకు రివీల్ కాదు.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

ఈ రోజు రాత్రి నుంచి OG ప్రీమియర్ షోలతో ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు లభించబోతున్నాయి. స్క్రీన్ పై పవన్ మాస్ గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఇప్పటికే పండగ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇంకెందుకు ఆలస్యం... OG చూడటానికి సిద్ధమవ్వండి!

Advertisment
తాజా కథనాలు