Pakistan : పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి ఔట్!
భారత్ లో నవంబర్ 28 నుంచి జరగనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా వెల్లడించింది.
భారత్ లో నవంబర్ 28 నుంచి జరగనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా వెల్లడించింది.
పాకిస్తాన్లో ప్రవహించే ముఖ్యమైన నది కునార్పై డ్యామ్‌లను వీలైనంత త్వరగా నిర్మించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌గా మారనుంది. కునార్ నది పాకిస్తాన్ వ్యవసాయం, నీటి అవసరాలకు కీలకం.
పాకిస్థాన్-అప్గానిస్థాన్ మధ్య అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. దీనివల్ల అక్కడి ప్రజలకు ఇది పెను భారంగా మారింది. ప్రస్తుతం పాక్‌లో కిలో టమాటాల ధర రూ.600 పాకిస్థానీ రూయాయలు ఉన్నట్లు సమాచారం.
పాక్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ నగరాన్ని ప్రమాదం చుట్టుముట్టింది. దీనికి కారణం భారత్‌లో దీపావళి సంబరాలని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. మంగళవారం నాటికి, లాహోర్ AQI 266కి చేరుకుంది.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ దేశీయ మార్కెట్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. టమోటా ధరలు విపరీతంగా పెరిగాయి. లాహోర్, కరాచీతో సహా అనేక ప్రధాన నగరాల్లో టమోటా ధర కిలోగ్రాముకు రూ.700కి చేరుకుంది.
పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం 11:12 గంటలకు (IST) రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. పాకిస్తాన్ కొత్త వన్డే కెప్టెన్‌ను నియమించింది పీసీబీ. మహ్మద్ రిజ్వాన్ స్థానంలోపాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదిని కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించినట్లు పీసీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.