Pakistan : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

పాకిస్తాన్ క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. పాకిస్తాన్ కొత్త వన్డే కెప్టెన్‌ను నియమించింది పీసీబీ. మహ్మద్ రిజ్వాన్ స్థానంలోపాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదిని కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించినట్లు పీసీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

New Update
pcb

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. పాకిస్తాన్ కొత్త వన్డే కెప్టెన్‌ను నియమించింది పీసీబీ. మహ్మద్ రిజ్వాన్ స్థానంలోపాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదిని కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ అకిబ్ జావేద్, జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులు హాజరైన సమావేశం తర్వాత రిజ్వాన్ స్థానంలో అఫ్రిదిని కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు.

నవంబర్ 4న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తలపడినుంది పాక్. ఈ క్రమంలో ఈ సీరిస్ నుంచి షాహీన్ అఫ్రిది  వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 25 ఏళ్ల వయసులోనే షాహీన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. 2018లో పాక్ తరపున అరంగేట్రం చేసిన అతను 66 వన్డేల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు, 24.28 సగటుతో 131 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో అగ్రశ్రేణి పేసర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. షాహీన్ చివరిసారిగా 2024 ప్రారంభంలో పాకిస్థాన్‌కు కెప్టెన్ గా వ్యవహరించాడు.  న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల స్వదేశీ సిరీస్‌లో T20I జట్టుకు కెప్టెన్ గా చేశాడు. ఆ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది.

వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు

ఇక గత అక్టోబర్‌లో వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ రిజ్వాన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీలో వైఫల్యం, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఓటమి కారణంగా తప్పించినట్లు తెలుస్తోంది. రిజ్వాన్ నాయకత్వంలో పాకిస్తాన్ 20 వన్డేల్లో 9 గెలిచి 11 ఓడింది. పాకిస్థాన్ క్రికెట్‌లో తరచూ జరుగుతున్న కెప్టెన్సీ మార్పుల పరంపరలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. షాహీన్ గతంలో 2024 ప్రారంభంలో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించారు, కానీ న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓటమి తర్వాత ఆ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు. ప్రస్తుతం పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు షాన్ మసూద్, టీ20 జట్టుకు సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్లుగా ఉండగా, వన్డే జట్టు పగ్గాలను షాహీన్ షా అఫ్రిది చేపట్టారు.

Also read : HYD AQI INDEX : దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం! AQI ఇండెక్స్ ఎంతో తెలిస్తే షాక్!

Advertisment
తాజా కథనాలు