/rtv/media/media_files/2025/10/24/tomato-2025-10-24-17-02-17.jpg)
Pakistan hit hard as Afghan border closure sends tomato prices soaring 400% in the country
ఇటీవల పాకిస్థాన్-అప్గానిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. దీనివల్ల అక్కడి ప్రజలకు ఇది పెను భారంగా మారింది. సరిహద్దు మూసివేత వల్ల అక్కడ నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కూరగాయాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, పాలు, మాంసం, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఉద్రిక్తతలకు ముందుతో పోలిస్తే పాకిస్థాన్‌లో టమాటా ధరలు ఏకంగా ఐదు రేట్లు పెరిగాయని అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే చెప్పాల్సిందే.. కేంద్రం IT చట్టంలో మార్పులు!
ప్రస్తుతం పాక్‌లో కిలో టమాటాల ధర రూ.600 పాకిస్థానీ రూయాయలు ఉన్నట్లు సమాచారం. అఫ్గానిస్థాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పాక్-అఫ్గాన్ బోర్డర్ నుంచి ప్రతి సంవత్సరం 2.3 బిలియనన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం వల్ల సరిహద్దుల్లో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా ఆపేశామని పేర్కొన్నారు. దీంతో ఒక్కరోజుకు ఇరువైపులా దాదాపు మిలియన్ డాలర్లు(రూ.8 కోట్లు) నష్టం వస్తున్నట్లు పేర్కొన్నారు.
🇵🇰 #Pakistan pays the price for its #AfghanTaliban clash
— Your Views Your News (@urviewsurnews) October 24, 2025
Since border clashes with #Afghanistan, Pakistan faces skyrocketing #food prices:
Tomatoes: ₹600/kg , Ginger: ₹750/kg
5,000+ containers stranded at #Torkham & #chamanborder#IRLARM#brunardo#AfghanistanPakistanWarpic.twitter.com/SxYdX7NoZM
Also Read: కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి... ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
అంతేకాదు అఫ్గాన్ నుంచి పాకిస్థాన్‌కు సరఫరా చేసే 5 కంటైనర్ల కూరగాయలు కూడా పాడైపోయాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సరిహద్దుకు ఇరువైపులా ఏకంగా 5 వేల కంటైనర్లు నిలిచిపోయినట్లు పాక్‌లో ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉండగా గత కొన్ని రోజుల నుంచి ఇరు దేశాల్లో ఘర్షణలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో గత వారం ఖతార్ రాజధాని దోహాలో పాక్-అఫ్గాన్ రక్షణ మంత్రుల మధ్య చర్చలు కుదిరి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ ఇరుదేశాల మధ్య సరిహద్దు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. అక్టోబర్ 25న టర్కీలోని ఇస్తాంబుల్‌లో తదుపరి రెండో రౌండ్ చర్చలు నిర్వహించనున్నారు.
Follow Us