Pakistan : పాకిస్తాన్ సంచలన నిర్ణయం..  వరల్డ్ కప్ నుంచి ఔట్!

భారత్ లో నవంబర్ 28 నుంచి జరగనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా వెల్లడించింది.

New Update
pakistan

భారత్ లో నవంబర్ 28 నుంచి జరగనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 28 నుండి డిసెంబర్ 28 వరకు తమిళనాడులోని చెన్నై, మధురై వేదికల్లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఈ టోర్నీ నుంచి పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) తమ జట్టును ఉపసంహరించుకుంటున్నట్లు FIHకు తెలియజేసింది.

ఇది రెండోసారి

రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ సంబంధాలు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది భారత్‌లో హాకీ టోర్నమెంట్ నుండి పాకిస్తాన్ తప్పుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఆగస్టులో పురుషుల ఆసియా కప్ నుండి పాకిస్తాన్ వైదొలిగింది, ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను ప్రత్యామ్నాయంగా ఆహ్వానించారు. అయితే పాకిస్తాన్ వైదొలగడంతో, ఆ స్థానంలో పాల్గొనే ప్రత్యామ్నాయ జట్టును త్వరలోనే ప్రకటిస్తామని FIH తెలియజేసింది.  

ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు భారత్, చిలీ, స్విట్జర్లాండ్‌లతో కలిసి గ్రూప్ బిలో ఉంది. దీంతో, క్రీడాభిమానులు ఆశించిన భారత్-పాక్ పోరు ఈసారి లేకుండా పోయింది.పాకిస్తాన్ వైదొలగిన విషయం తమకు FIH ద్వారా అధికారికంగా అందలేదని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూనియర్ హాకీ జట్లకు ఈ టోర్నమెంట్ ఒక ముఖ్యమైన వేదిక కాగా, పాకిస్తాన్ వంటి బలమైన జట్టు వైదొలగడం హాకీ వర్గాలను నిరాశపరిచింది. కాగా ఏప్రిల్ 22న జరిగిన పహలగామ్ ఉగ్రవాద దాడిపై భారత్ ఆపరేషన్ సిందూర్ రూపంలో ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుండి రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి.

Advertisment
తాజా కథనాలు