Diwali 2025: పాక్ ప్రధాని దీపావళి శుభాకాంక్షలు.. ఏమని ట్వీట్ చేశాడో తెలుసా?

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు,. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సోదర సోదరీమణులకు, ముఖ్యంగా పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

New Update
pak pm

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు,. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సోదర సోదరీమణులకు, ముఖ్యంగా పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి సందర్భంగా పాకిస్థాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి శుభాకాంక్షలు. ఈ పండుగ మన ప్రపంచంలో శాంతి, ఆనందం మరియు సామరస్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను," అని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.  

పాకిస్థాన్ సమాజంలో ఉన్న మతాల వైవిధ్యాన్ని తాము గర్వంగా భావిస్తున్నామని, ఇది తమ దేశ సమగ్రతను, ఉమ్మడి సంస్కృతిని మరింత సుసంపన్నం చేస్తుందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఉన్నారు. వారు తమ ముస్లిం సోదరులతో కలిసి దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు ప్రధాని షెహబాజ్ సంతోషం వ్యక్తం చేశారు.

మోదీ విషెస్ 

 మరోవైపు దీపావళి(Diwali 2025) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. "దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ మన జీవితాలను సామరస్యం, సంతోషం, శ్రేయస్సుతో ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను. మన చుట్టూ సానుకూలత స్ఫూర్తి ప్రబలాలి." అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ప్రధాని మోదీ ఈ సంవత్సరం కూడా దేశ సరిహద్దుల్లోని సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.దేశ రక్షణ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఆయన ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు