భారత్ దీపావళి దెబ్బకి పాకిస్థాన్‌లో పొగలు.. డేంజర్‌లో లాహోర్!

పాక్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ నగరాన్ని ప్రమాదం చుట్టుముట్టింది. దీనికి కారణం భారత్‌లో దీపావళి సంబరాలని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. మంగళవారం నాటికి, లాహోర్ AQI 266కి చేరుకుంది.

New Update
Lahore allegedly polluted

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ నగరాన్ని ప్రమాదం చుట్టుముట్టింది. దీనికి కారణం భారత్‌లో దీపావళి సంబరాలని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. మంగళవారం ఉదయం నాటికి, లాహోర్ AQI 266కి చేరుకుంది. దీనితో ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో న్యూఢిల్లీ తర్వాత లాహోర్ రెండో స్థానంలో నిలిచింది.

పంజాబ్ పర్యావరణ పరిరక్షణ విభాగం ప్రకారం.. ఢిల్లీ, ఇతర ఉత్తర నార్త్ ఇండియా సిటీల నుంచి కాలుష్య కారకాలను మోసుకెళ్లి పాకిస్తాన్ పంజాబ్‌లో పర్యవరణ పరిస్థితులను మరింత దిగజార్చారని పేర్కొంది. విషపూరిత గాలిని నివారించడానికి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం లాహోర్‌లోని కీలక రహదారులపై యాంటీ-స్మోగ్ గన్‌లను మోహరించడం, నీరు చల్లడం వంటి అత్యవసర చర్యలను ప్రారంభించింది. ఈ కార్యకలాపాల కోసం కనీసం తొమ్మిది విభాగాలను రంగంలోకి దించారు. ప్రాంతీయ ప్రభుత్వం కూడా స్మోగ్ రెస్పాన్స్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది. గంటకు 4 నుండి 7 కి.మీ వేగంతో వీచే గాలిలో ఉన్న కణాలు సరిహద్దు దాటి లాహోర్, ఫైసలాబాద్, గుజ్రాన్‌వాలా, సాహివాల్, ముల్తాన్ వంటి పాకిస్తాన్ నగరాలను ప్రభావితం చేశాయి.

సోమవారం సాయంత్రం నాటికి, లాహోర్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా మూడవ స్థానంలో నిలిచింది. స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ గ్రూప్ అయిన IQAir కూడా లాహోర్‌లో PM2.5 సాంద్రతలను 187 గ్రా/మీ వద్ద నివేదించింది, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన సురక్షిత గాలి పరిమితి కంటే దాదాపు 37 రెట్లు ఎక్కువ.

మరియం నవాజ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న మరియం ఔరంగజేబ్ ఈ పరిస్థితిని సరిహద్దు దాటిన పర్యావరణ సవాలుగా అభివర్ణించారు. అధికారులు వచ్చే కాలుష్య కారకాలను పర్యవేక్షిస్తూ స్థానిక ఉద్గారాలను తగ్గించడంలో పౌరులు తమ పాత్ర పోషించాలని ఆమె కోరారు. అమృత్‌సర్, లూథియానా, హర్యానా నుండి వచ్చే గాలి కాలుష్యాన్ని తీసుకువస్తున్నాయని ఆమె Xలో పోస్ట్ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ సామగ్రిని కవర్ చేస్తామని, కీలక మార్గాల్లో ట్రాఫిక్‌ను పరిమితం చేస్తామని, పొగ విడుదల చేసే వాహనాలకు జరిమానా విధించడం లేదా సీజ్ చేయడం జరుగుతుందని ఆమె ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు